iDreamPost
android-app
ios-app

చెత్త ట్రాక్‌ రికార్డును కొసాగించిన రోహిత్‌! భయం పోలేదా?

  • Published Dec 26, 2023 | 3:25 PM Updated Updated Dec 27, 2023 | 10:33 AM

సౌతాఫ్రికాతో ప్రారంభమైన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా మంచి స్టార్ట్‌ దక్కలేదు. టాపార్డర్‌ కుప్పకూలడంతో పాటు.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్‌ దారుణంగా విఫలం అయ్యాడు. అయితే.. రోహిత్‌కు ఇంకా ఆ భయం పోలేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో ప్రారంభమైన టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా మంచి స్టార్ట్‌ దక్కలేదు. టాపార్డర్‌ కుప్పకూలడంతో పాటు.. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్‌ దారుణంగా విఫలం అయ్యాడు. అయితే.. రోహిత్‌కు ఇంకా ఆ భయం పోలేదని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 26, 2023 | 3:25 PMUpdated Dec 27, 2023 | 10:33 AM
చెత్త ట్రాక్‌ రికార్డును కొసాగించిన రోహిత్‌! భయం పోలేదా?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన చెత్త ట్రాక్‌ రికార్డును మరోసారి కొనసాగించాడు. సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ప్రొటీస్‌ స్టార్‌ బౌలర్‌ కగిసో రబడా వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ చివరి బంతికి నాంద్రే బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ సమర్పించుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో ప్లేయింగ్‌ స్టార్ట్స్‌ ఇస్తూ.. సూపర్‌ ఫామ్‌లో కొనసాగిన రోహత్‌.. వరల్డ్‌ కప్‌ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకొని తొలిసారి మళ్లీ బ్యాట్‌ పట్టి గ్రౌండ్‌లోకి దిగాడు. వరల్డ్‌ కప్‌ ఓటమిని మర్చిపోయి.. రోహిత్‌ శర్మ ఎలా ఆడతాడో అని క్రికెట్‌ అభిమానులంతా ఈ టెస్ట్‌ మ్యాచ్‌పై ఆసక్తి చూపించారు. కానీ, రోహిత్‌ వాళ్లందరినీ నిరాశపరుస్తూ.. 14 బంతుల్లో ఒక ఫోర్‌తో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన జైస్వాల్‌ ఫోర్లతో అలరించినా.. రోహిత్‌ అవుట్‌ అయిన కొద్ది సేపటికే అతను కూడా అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ సైతం అవుట్‌ కావడంతో టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. ఈ మూడు వికెట్లలో రోహిత్‌ శర్మ అవుట్‌ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్‌ కమ్‌ సీనియర్‌ బ్యాటర్‌గా రోహిత్‌పై భారీ అంచనాలు, బాధ్యత కూడా ఉంది. కానీ, వాటిని వమ్ము చేస్తూ.. సౌతాఫ్రికాలో తన చెత్త ట్రాక్‌ రికార్డును రోహిత్‌ శర్మ కంటిన్యూ చేశాడు. అసలు సౌతాఫ్రికాలో రోహిత్‌ శర్మ ఎందుకు అంత భయపడుతూ ఆడుతుంటాడో ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులకు అస్సలు అర్థం కాని ప్రశ్న. మంచి నీళ్లు తాగినంత సులువుగా సిక్సులు కొడుతూ.. హాఫ్‌ సెంచరీ, సెంచరీలు చాలా ఈజీగా చేసే రోహిత్‌కు టెస్టు క్రికెట్‌లో సౌతాఫ్రికాలో ఒక్కటంటే ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదంటే నమ్మడం కష్టమే. కనీసం ఈ సారైనా ఆ లోటును తీరుస్తూ.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఆశపడిన అభిమానులను నిరాశ పరుస్తూ.. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలం అయ్యాడు.

సౌతాఫ్రికా పిచ్‌లు బౌన్స్‌, పేస్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఏ మూల అయినా అద్భుతంగా ఆడే రోహిత్‌ శర్మ.. ఒక్క సౌతాఫ్రికాలో బ్యాటింగ్‌ చేసేందుకు ఇబ్బంది పడుతుంటాడు. 2013-14 మధ్య కాలంలో సౌతాఫ్రికా పర్యటనకు తొలి సారి వెళ్లిన రోహిత్‌ శర్మ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆ టైమ్‌లో రోహిత్‌ మిడిల్డార్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. జోహనెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్‌ చేసిన పరుగులు కేవలం 20. తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇక డర్బన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో అయితే తొలి ఇన్నింగ్స్‌లో డెల్‌ స్టెయిన్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేశాడు. మొత్తంగా ఆ రెండు టెస్టుల్లో 11.25 సగటుతో 45 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక మరో సారి 217-18 మధ్య కాలంలో మరోసారి సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి రెండు టెస్టులు ఆడాడు. అప్పుడు కూడా దారుణంగా విఫలం అయ్యాడు హిట్‌ మ్యాన్‌. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 21 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేశాడు. ఇక సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ 10, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు తాజాగా సెంచూరియన్‌లోనే జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులకే అవుట్‌ అయ్యాడు. దీంతో.. ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో టెస్టుల్లో రోహిత్‌ శర్మ హైయొస్ట్‌ స్కోర్‌ 47 మాత్రమే. మొత్తంగా సౌతాఫ్రికాలో 9 టెస్ట్‌ ఇన్నింగ్స్‌లు ఆడి రోహిత్‌ చేసిన పరుగులు 128. ఇలా సౌతాఫ్రికాలో రోహిత్‌ శర్మ దారుణంగా విఫలం అవుతున్నాడు. ఈ బ్యాడ్ రికార్డును అధిగమించేందుకు రోహిత్‌కు.. మరో మూడు ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. మరి వాటిలో అయినా రోహిత్‌ రాణించి.. సౌతాఫ్రికా పిచ్‌లంటే తనకు ఎలాంటి భయం లేదని నిరూపిస్తాడో? లేదో? చూడాలి. మరి సౌతాఫ్రికా పిచ్‌లపై రోహిత్‌ పడుతున్న ఇబ్బందిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.