iDreamPost

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా..

  • Author Soma Sekhar Published - 09:59 AM, Tue - 5 September 23
  • Author Soma Sekhar Published - 09:59 AM, Tue - 5 September 23
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా..

ఆసియా కప్ 2023లో భాగంగా టీమిండియా సూపర్-4లో అడుగుపెట్టింది. సోమవారం నేపాల్ తో జరిగిన కీలక మ్యాచ్ లో డక్ వర్త్ లూస్ పద్దతి ద్వారా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాను నేపాల్ వణికించిందనే చెప్పాలి. టీమిండియా ఫీల్డర్ల పుణ్యమాని నేపాల్ జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ లు తలా 3 వికెట్లతో రాణించారు. వర్షం మ్యాచ్ కు అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిప్ పద్దతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. ఆ టార్గెట్ ను వికెట్ నష్టపోకుండా ఛేదించి విజయం సాధించింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఆసియా కప్ లో భాగంగా నేపాల్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ రోహిత్ శర్మ (74), శుభ్ మన్ గిల్ (67) పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ముఖ్యంగా రోహితో నేపాల్ బౌలర్లపై సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో అర్ధశతకం సాధించడం ద్వారా రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు.

ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడంతో.. ఆసియా కప్ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు రోహిత్ 10 సార్లకు పైగా యాబైకి పైగా స్కోర్లను సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 9 సార్లు యాబైకి పైగా ఆసియా కప్ లో స్కోర్లు సాధించాడు. తాజాగా ఈ మ్యాచ్ తో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు రోహిత్. ఈ రికార్డుతో పాటుగా తన కెరీర్ లో 250వ సిక్స్ మైలురాయిని చేరుకున్నాడు రోహిత్. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు రోహిత్. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు. మరి ఈ రికార్డులు రోహిత్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి