iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ రేర్ ఫీట్.. ఏ కెప్టెన్​కూ సాధ్యం కానిది చేసి చూపించాడు!

  • Published Sep 21, 2024 | 7:56 AM Updated Updated Sep 21, 2024 | 7:56 AM

Rohit Sharma Completes 1000 Runs In Calendar Year 2024: రికార్డుల వేటలో ఎప్పుడూ ముందంజలో ఉంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అతడేం సాధించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma Completes 1000 Runs In Calendar Year 2024: రికార్డుల వేటలో ఎప్పుడూ ముందంజలో ఉంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అతడేం సాధించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 21, 2024 | 7:56 AMUpdated Sep 21, 2024 | 7:56 AM
Rohit Sharma: రోహిత్ రేర్ ఫీట్.. ఏ కెప్టెన్​కూ సాధ్యం కానిది చేసి చూపించాడు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగితే రికార్డులకు మూడినట్లే. బ్యాట్ చేతపడితే పాత రికార్డులకు పాతర పెడతాడు హిట్​మ్యాన్. నీళ్లు తాగినంత ఈజీగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటాడు. అలాగని ప్రత్యేకంగా వాటి కోసం ఆడడు. టీమ్ గెలుపు కోసం తన పని తాను చేసుకుపోతాడు. అదే క్రమంలో పాత రికార్డుల బూజు కూడా దులుపుతుంటాడు. రికార్డుల వేటలో ఎప్పుడూ ముందంజలో ఉంటాడు భారత కెప్టెన్. అలాంటోడు తాజాగా మరో అరుదైన ఘనత అందుకున్నాడు. బంగ్లాదేశ్​తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్​లో రేర్ ఫీట్ నమోదు చేశాడు హిట్​మ్యాన్. ఏ ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ వల్ల కానిది.. టీమిండియా సారథి చేసి చూపించాడు. ఇంతకీ అతడు నెలకొల్పిన రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెన్నై టెస్ట్​లో రికార్డ్ క్రియేట్ చేశాడు రోహిత్. సెకండ్ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగి 7 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. త్వరగానే ఔట్ అయినా ఈ ఇన్నింగ్స్​తో అతడు ఈ ఏడాది 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ క్రికెట్​లో 1000 పరుగుల మార్క్​ను చేరుకున్న తొలి కెప్టెన్​గా నిలిచాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా.. ఇలా ఏ టీమ్ కెప్టెన్ కూడా ఇంకా ఈ మార్క్​ను టచ్ చేయలేదు. రోహిత్ ఒక్కడే దీన్ని అందుకున్నాడు. ఒకవైపు జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తూ.. మరోవైపు బ్యాటింగ్​లో తానూ సక్సెస్ అవుతున్నాడనే దానికి ఈ మైల్​స్టోనే ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు. తాను పరుగులు చేయడం ద్వారా టీమ్​లోని ఇతర సీనియర్లు, యంగ్​స్టర్స్​లో కూడా తప్పక పరుగులు చేయాలనే దాహాన్ని అలవాటు చేస్తుండటాన్ని మెచ్చుకోవాల్సిందే.

ఇక, బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో టీమిండియా అదరగొడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో 376 పరుగులకు ఆలౌట్ అయింది భారత్. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ప్రత్యర్థి జట్టును 149 పరుగులకే పరిమితం చేసింది. జస్​ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో అపోజిషన్ టీమ్ నడ్డి విరిచాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్​దీప్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు వికెట్ నష్టానికి 23 పరుగులతో ఉంది. భారత్ ఆధిక్యం 250 పరుగులకు చేరింది. ఇంకో 200 పరుగులు చేస్తే లీడ్ 450కి చేరుతుంది. అప్పుడు మరింత కాన్ఫిడెన్స్​తో బంగ్లా పని పట్టొచ్చు. అయితే మొదటి ఇన్నింగ్స్​లో 150 మార్క్​ను కూడా టచ్ చేయలేకపోయిన ప్రత్యర్థి జట్టు.. భారత పేస్ అటాక్ ముందు నిలబడటం కష్టంగానే ఉంది. మరి.. రోహిత్ రేర్ ఫీట్​ను అందుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.