iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్​ను వణికిస్తున్న ఆకాశ్​దీప్.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావ్ బాస్!

  • Published Sep 20, 2024 | 3:50 PM Updated Updated Sep 20, 2024 | 3:50 PM

IND vs BAN, Akash Deep: చెన్నై టెస్టులో బంగ్లాదేశ్​కు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

IND vs BAN, Akash Deep: చెన్నై టెస్టులో బంగ్లాదేశ్​కు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

  • Published Sep 20, 2024 | 3:50 PMUpdated Sep 20, 2024 | 3:50 PM
బంగ్లాదేశ్​ను వణికిస్తున్న ఆకాశ్​దీప్.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావ్ బాస్!

టీమిండియా వ్యూహం పనిచేసింది. స్పిన్ పిచ్​ను పేస్ వికెట్​గా మార్చి బంగ్లాదేశ్​కు షాక్ ఇవ్వాలనుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. పేస్, స్వింగ్​కు అనుకూలిస్తున్న చెన్నై వికెట్​పై బంగ్లా బ్యాటర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు భారత బౌలర్లు. ఒక్కో పరుగు చేయడానికి చెమటోడ్చేలా చేస్తున్నారు. ఒక బౌలర్ అయితే ఆ టీమ్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. క్రీజులో నిలదొక్కుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నాడు. అతడే ఆకాశ్​దీప్. అతడి దెబ్బకు బంగ్లా బ్యాటర్లు భయపడుతున్నారు. అద్భుతమైన పేస్, అనూహ్యమైన బౌన్స్, స్వింగ్​తో అతడు వేస్తున్న డెలివరీస్​ ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు వణికిపోతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే బంగ్లాకు షాక్ ఇచ్చాడు ఆకాశ్​దీప్.

బంగ్లాదేశ్ బ్యాటర్లు జస్​ప్రీత్ బుమ్రా కోసం ప్రిపేర్ అయి వచ్చారు. అతడి స్పెల్​ను దాటితే మిగతా వాళ్లను అలవోకగా ఎదుర్కొవచ్చని.. పరుగుల వరద పారించొచ్చని అనుకున్నారు. కానీ ఇంకో ఎండ్​ నుంచి బౌలింగ్ స్టార్ట్ చేసిన ఆకాశ్​దీప్ వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. ఆరంభంలోనే జాకీర్ ఖాన్ (3)ను క్లీన్​బౌల్డ్ చేశాడు. ఫుల్ లెంగ్త్ డెలివరీతో అతడ్ని బీట్ చేసి బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0)ను క్లీన్​బౌల్డ్ చేశాడు. ఫుల్ లెంగ్త్​లో పడి లోపలకు దూసుకొచ్చిన బంతిని ఆడలేకపోయాడు మోమినుల్. తొలి బంతికే ఔట్ అయి నిరాశతో క్రీజును వీడాడు. గంటకు 140 కిలోమీటర్లకు తగ్గని వేగం, స్వింగ్, బౌన్స్​తో బంతులు సంధిస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు ఆకాశ్​దీప్.

దిగ్గజ పేసర్ మహ్మద్ షమి లేని లోటు కనపడకుండా చేశాడు ఆకాశ్​దీప్. అతడిలాగే మెరుపు వేగంతో బంతులు విసిరాడు. బ్యాటర్లను ఊరిస్తూ ఫుల్ లెంగ్త్ డెలివరీస్ వేశాడు. వికెట్లు తీయాలనే కసితో బౌలింగ్ చేశాడు. ఫస్ట్ స్పెల్​లో 5 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు ఆకాశ్​దీప్. ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టసాగారు. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (3 వికెట్లు), స్పిన్నర్ రవీంద్ర జడేజా (2 వికెట్లు) ఆ టీమ్ పనిపట్టారు. దీంతో ఆకాశ్​దీప్ మళ్లీ బౌలింగ్​ చేయాల్సిన అవసరం రాలేదు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ 8 వికెట్లకు 112 పరుగులతో ఉంది. ఆ టీమ్ స్కోరు 150 దాటడం కష్టంగానే ఉంది. ఈ ఇన్నింగ్స్​లో హైలైట్​గా నిలిచిన ఆకాశ్​దీప్ బౌలింగ్ చూసిన అభిమానులు.. షమి వారసుడు దొరికేశాడని అంటున్నారు. అచ్చం అతడిలాగే బౌలింగ్ చేస్తున్నాడని, రివర్స్ స్వింగ్, యార్కర్స్, స్లో బౌన్సర్స్ లాంటివి నేర్చుకుంటే మరింత డేంజరస్ బౌలర్​గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి బౌలర్లే మనకు కావాలని.. ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నావ్ బాస్ అని అడుగుతున్నారు. ఆకాశ్​దీప్ ఇలాగే బౌలింగ్ చేస్తూ పోతే సిరాజ్ ప్లేస్​కు ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మరి.. ఆకాశ్​దీప్ బౌలింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.