Rohit Sharma: ధోని రికార్డ్‌ బ్రేక్‌! రోహిత్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ సచిన్‌ టెండూల్కర్‌!

ఇంగ్లండ్‌పై రెండో టెస్ట్‌ విజయంతో రోహిత్‌ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌పై రెండో టెస్ట్‌ విజయంతో రోహిత్‌ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయంతో మంచి జోష్‌లో ఉన్న రోహిత్‌.. ఈ రికార్డ్‌తో మరింత ఖుషీ కానున్నాడు. పైగా ఈ రికార్డును రోహిత్‌.. టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని అధిగమించి సాధించాడు. ధోని రికార్డును బ్రేక్‌ చేసి.. సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఆటగాడిగా టీమిండియా సాధించిన అత్యధిక విజయాల్లో భాగమైన మూడో ఆటగాడిగా రోహిత్‌ రికార్డుల్లోక్కెకాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్ట్‌ విజయంతో రోహిత్‌ శర్మ.. 296 విజయాల్లో భాగమయ్యాడు. వీటిలో టెస్ట్‌, వన్డే, టీ20 మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.

ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని 295 విజయాల్లో భాగమయ్యాడు. ఇప్పుడు ఈ రికార్డును రోహిత్‌ అధిగమించి.. మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు రోహిత్‌ కన్ను దిగ్గజ క్రికెటర్‌, ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌పై పడింది. 303 విజయాలతో సచిన్‌ టెండూల్కర్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మరో 8 విజయాల్లో రోహిత్‌ భాగమైతే.. సచిన్‌ రికార్డును దాటేసి.. టీమిండియా సాధించిన అత్యధిక విజయాల్లో భాగమైన రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అయితే.. అది పెద్ద కష్టమేమి కాదు. రోహిత్‌ రిటైర్‌ అయ్యేలోపు.. మరో 8 విజయాల్లో చాలా ఈజీగా భాగమవుతాడు.

అయితే.. మరి ఒకటో స్థానంలో ఉన్న ఆటగాడు ఎవరా? అనే డౌట్‌ మీకు రావొచ్చు. ఇంకెవరు.. కింగ్‌ విరాట్‌ కోహ్లీ. 313 విజయాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే.. రోహిత్‌ శర్మకు సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసే ఛాన్స్‌ ఉంది కానీ, కోహ్లీ రికార్డ్‌ను బ్రేక్‌ చేసే ఛాన్స్‌ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే.. కోహ్లీ-రోహిత్‌ మరికొన్నాళ్లు కలిసి ఆడే అవకాశం ఉంది. ఆ సమయంలో టీమిండియా గెలిస్తే.. ఇద్దరూ ఆ విజయంలో భాగస్వామ్యం అవుతారు. సో.. రోహిత్‌ నంబర్‌ పెరుగుతూ పోతుంటే.. అటువైపు కోహ్లీ నంబర్‌ కూడా పెరుగుతుంది. పైగా రోహిత్‌ శర్మ కంటే.. కోహ్లీనే ఎక్కువ కాలం ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా.. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యధిక విజయాల్లో భాగస్వామి అయిన ఆటగాడి కోహ్లీనే నిలిచే అవకాశం ఉంది. అయితే.. రోహిత్‌ మాత్రం కచ్చితంగా నంబర్‌ 2గా ఉండే ఛాన్స్‌ ఉంది. మరి రోహత్‌ 296 విజయాల్లో భాగస్వామి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments