iDreamPost
android-app
ios-app

VIDEO: కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌! వాహా.. క్యా సీన్‌ హై

  • Published Oct 27, 2023 | 3:08 PM Updated Updated Oct 27, 2023 | 3:08 PM

టీమిండియా ఇద్దరు స్టార్లు ఉన్నారు.. ఒకరు విరాట్‌ కోహ్లీ, ఇంకొకరు రోహిత్‌ శర్మ. ఒకరు కెప్టెన్‌ అయితే.. మరొకరు మాజీ కెప్టెన్‌. టీమిండియ వీళ్లిద్దరు రెండు కళ్లు. అలాంటి ఆటగాళ్లు నెట్స్‌లో ఒకరు బ్యాటింగ్‌ చేస్తుండగా ఇంకొకరు బౌలింగ్‌ చేస్తున్నారు. ఈ సీన్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు ఫిదా అవుతుంటే.. దీని వెనుక మాస్టర్‌ ప్లాన్‌ ఏదో ఉందని అనుకుంటున్నారు. మరి అదేంటో ఇ

టీమిండియా ఇద్దరు స్టార్లు ఉన్నారు.. ఒకరు విరాట్‌ కోహ్లీ, ఇంకొకరు రోహిత్‌ శర్మ. ఒకరు కెప్టెన్‌ అయితే.. మరొకరు మాజీ కెప్టెన్‌. టీమిండియ వీళ్లిద్దరు రెండు కళ్లు. అలాంటి ఆటగాళ్లు నెట్స్‌లో ఒకరు బ్యాటింగ్‌ చేస్తుండగా ఇంకొకరు బౌలింగ్‌ చేస్తున్నారు. ఈ సీన్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు ఫిదా అవుతుంటే.. దీని వెనుక మాస్టర్‌ ప్లాన్‌ ఏదో ఉందని అనుకుంటున్నారు. మరి అదేంటో ఇ

  • Published Oct 27, 2023 | 3:08 PMUpdated Oct 27, 2023 | 3:08 PM
VIDEO: కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌! వాహా.. క్యా సీన్‌ హై

టీమిండియాకు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రెండు కళ్ల లాంటి వాళ్లు. ప్రస్తుతం ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వరల్డ్‌ కప్‌లో టీమిండియాను ముందుండి నడిపిస్తున్నారు. టీమిండియా తరఫున ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్ల జాబితాలో ఈ ఇద్దరే ముందున్నారు. ఇప్పటికే రెండో సెంచరీ కూడా చేశారు. ఇక టీమిండియా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది టేబుల్‌ టాపర్‌గా ఉంది. ఐదుకు ఐదు మ్యాచ్‌లు గెలిచి ఓటమి ఎరుగని టీమ్‌గా ఉంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ లాంటి పెద్ద టీమ్స్‌ను మట్టికరిపించింది. ఇక ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడనుంది.

లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా రెడీ అవుతుంది. ఇప్పటికే ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ప్రాక్టీస్‌లో విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ వేయడం విశేషం. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ వేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పాండ్యా ఓవర్‌ను విరాట్‌ కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతులు వేసిన తర్వాత పాండ్యా గాయంతో గ్రౌండ్‌ను వీడాడు. దీంతో ఆ మిగిలిన మూడు బాల్స్‌ను కోహ్లీ వేశాడు. పాండ్యా మూడు బంతుల్లో 8 పరుగులు ఇస్తే.. చివరి మూడు బంతుల్లో కోహ్లీ కేవలం 2 రన్స్‌ మాత్రమే ఇవ్వడం విశేషం.

టీమిండియాలో కేవలం బౌలర్లు, ఆల్‌రౌండర్లు మాత్రమే బౌలింగ్‌ వేస్తున్నారని, పార్ట్‌టైమ్‌ బౌలర్లు కరువయ్యారనే విమర్శల నేపథ్యంలో కోహ్లీ బాల్‌ అందుకుని ఓ మూడు బాల్స్‌ వేయడం విశేషం. గతంలో సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌లు పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా బౌలింగ్‌ వేసేవారు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ, కోహ్లీ కూడా కొన్ని సార్లు బౌలింగ్‌ వేశారు. కానీ, చాలా కాలంగా బ్యాటర్లు ఎవరూ బౌలింగ్‌ జోలికి వెళ్లడం లేదు. బంగ్లాపై మూడ బాల్స్‌ వేసిన కోహ్లీ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కి ముందు నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అది కూడా రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తుండగా.. అతనికే బంతులు సంధించాడు. దీంతో ఇంగ్లండ్‌పై కోహ్లీ బౌలింగ్‌ చేస్తాడని క్రికెట్‌ అభిమానులు ఆశిస్తున్నారు. అంతకంటే ముందు కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కిందున్న వీడియో చూసి.. కోహ్లీ బౌలింగ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Telugu Rohit Sharma𓃵 fans (@telugu_rohitians45)