iDreamPost
android-app
ios-app

సూపర్-8కు ముందు రోహిత్​కు లారా సజెషన్.. గెలవాలంటే ఆ పని చేయాల్సిందేనంటూ..!

  • Published Jun 20, 2024 | 5:57 PMUpdated Jun 20, 2024 | 5:57 PM

సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను ఢీకొట్టనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా కీలక సూచన చేశాడు.

సూపర్-8లో భాగంగా తొలి మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను ఢీకొట్టనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా కీలక సూచన చేశాడు.

  • Published Jun 20, 2024 | 5:57 PMUpdated Jun 20, 2024 | 5:57 PM
సూపర్-8కు ముందు రోహిత్​కు లారా సజెషన్.. గెలవాలంటే ఆ పని చేయాల్సిందేనంటూ..!

పొట్టి కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న భారత్ ముందు ఇప్పుడు సిసలైన సవాల్ ఉంది. గ్రూప్ దశలో అదరగొట్టి సూపర్-8కి చేరుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు ప్రమాదకర ఆఫ్ఘానిస్థాన్, బంగ్గాదేశ్​తో పాటు ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇవాళ ఆఫ్ఘాన్​తో మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. అయితే అమెరికా నుంచి వెస్టిండీస్​కు వచ్చిన మన టీమ్.. అక్కడి వికెట్లకు తగ్గట్లు ఎలా అడ్జస్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కరీబియన్ స్లో పిచెస్​కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇక్కడి కండీషన్స్​లో బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్లు బాదడం కష్టమే. ఈ ఛాలెంజ్​ను రోహిత్ సేన ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.

సూపర్ పోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ భారత్​ను టెన్షన్ పెడుతోంది. జట్టుకు మూలస్తంభాలు లాంటి ఈ ఇద్దరు మోడర్న్ మాస్టర్స్ ఇప్పుడు పూర్ ఫామ్​తో బాధపడుతున్నారు. వీళ్లలో ఒక్కరైనా నిలబడి ఇన్నింగ్స్​ను నడిపించకపోతే సూపర్-8లో టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. రోహిత్, కోహ్లీల్లో ఒకరు యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాటర్లు హిట్టింగ్​కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే భారీ స్కోర్లు రావు. ఈ విషయంపై విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా రియాక్ట్ అయ్యాడు. సూపర్-8కు ముందు రోహిత్​కు మంచి సజెషన్ ఇచ్చాడతను. కోహ్లీతో కలసి పవర్​ప్లేలో హిట్​మ్యాన్​ పరుగులు పిండుకోవాలని సూచించాడు. వీళ్లిద్దరూ కలసి తొలి 6 ఓవర్లలో కనీసం 60 నుంచి 70 పరుగులు చేయాలన్నాడు. అప్పుడు టీమ్​కు తిరుగుండదన్నాడు.

‘రోహిత్-కోహ్లీలు అగ్రెసివ్ ప్లేయర్స్. వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే ఏదైనా సాధ్యమే. వాళ్లిద్దరూ వరల్డ్ క్లాస్ బ్యాటర్స్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వీళ్లు అదరగొట్టాలి. పవర్​ప్లేలో 60 నుంచి 70 పరుగులు చేయాలి. అలాగే ఇద్దరిలో ఒకరు యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖరి వరకు నిలబడాలి. అయితే ఎవరు అలా ఆడాలనేది మ్యాచ్ కండీషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు టచ్​లో ఉంటే ఇంకొకరు స్ట్రైక్ రొటేట్ చేసి అతడికి ఇస్తే సరిపోతుంది. ఇద్దరూ చెలరేగి ఆడాల్సిన అవసరం లేదు. ఒక్కరు బాదుడు మొదలుపెట్టినా చాలు. వీళ్లిద్దరూ బాగా ఆడటంతో పాటు ఇతర బ్యాటర్లు కూడా పార్ట్​నర్​షిప్స్ నమోదు చేయడంపై ఫోకస్ చేయాలి. అప్పుడు భారీ స్కోర్లు అవే వస్తాయి. పార్ట్​నర్​షిప్సే మ్యాచ్​ను డిసైడ్ చేస్తాయి’ అని లారా చెప్పుకొచ్చాడు. కోహ్లీతో కలసి పవర్​ప్లేలో భారీగా పరుగులు చేయడం, అవసరమైతే యాంకర్ ఇన్నింగ్స్ ఆడేందుకూ రోహిత్ వెనుకాడొద్దని లారా సూచించాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారనేది కీలకమని తెలిపాడు. ఈ స్టేజ్​లో రోకో జోడీ రాణించడం టీమిండియాకు చాలా ముఖ్యమని లారా వ్యాఖ్యానించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి