iDreamPost
android-app
ios-app

దులీప్ ట్రోఫీలో స్టార్లు అందరూ ఆడుతున్నా రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరం! కారణం?

  • Published Aug 15, 2024 | 12:05 PM Updated Updated Aug 15, 2024 | 12:05 PM

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ జట్లను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ వరకు దాదాపుగా అందరు టీమిండియా స్టార్లు ఇందులో ఉన్నారు. అయితే రోకో జోడీ మాత్రం టోర్నీకి దూరంగా ఉంటోంది.

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ జట్లను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ వరకు దాదాపుగా అందరు టీమిండియా స్టార్లు ఇందులో ఉన్నారు. అయితే రోకో జోడీ మాత్రం టోర్నీకి దూరంగా ఉంటోంది.

  • Published Aug 15, 2024 | 12:05 PMUpdated Aug 15, 2024 | 12:05 PM
దులీప్ ట్రోఫీలో స్టార్లు అందరూ ఆడుతున్నా రోహిత్, కోహ్లీ, బుమ్రా దూరం! కారణం?

భారత క్రికెట్​లో ఇప్పుడు దులీప్ ట్రోఫీ-2024 గురించి ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది. దీనికి కారణం టీమిండియా స్టార్లు ఇందులో పాల్గొనడమే. చాన్నాళ్లుగా భారత క్రికెటర్లు డొమెస్టిక్ లెవల్​లో సరిగ్గా పార్టిసిపేట్ చేయడం లేదు. అలాంటిది ఇప్పుడు అందరూ గంపగుత్తగా ఒకే టోర్నీలో బరిలోకి దిగనుండటంతో అందరూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ల సందడిని చూసేందుకు రెడీ అయిపోతున్నారు. తాజాగా దులీప్ ట్రోఫీ టీమ్స్​ను అనౌన్స్ చేసింది భారత క్రికెట్ బోర్డు. నాలుగు జట్లను ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి శుబ్​మన్ గిల్, రిషబ్ పంత్ వరకు దాదాపుగా అందరు టీమిండియా స్టార్లు ఇందులో ఉన్నారు. అయితే రోకో జోడీ మాత్రం టోర్నీకి దూరంగా ఉంటోంది. దీంతో వీళ్లు ఎందుకు ఆడట్లేదనే చర్చ మొదలైంది.

దులీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ ప్రకటించిన జట్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేర్లు లేవు. దీంతో వీళ్లు ఎందుకు టోర్నీకి దూరంగా ఉంటున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ ముగ్గురు స్టార్లు పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నారు. ఎవరూ గాయాలతో ఇబ్బంది పడటం లేదు. అంతా రెస్ట్ తీసుకుంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. త్వరలో టెస్ట్ సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఒకట్రెండు ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లు ఆడితే ఫిట్​నెస్​ మెరుగుపడటంతో పాటు టచ్​లోకి రావొచ్చు కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో రోకో జోడీతో పాటు బుమ్రాను ప్లానింగ్ ప్రకారమే బీసీసీఐ సెలెక్ట్ చేయలేదని సమాచారం.

Why not play in Duleep Trophy

వచ్చే నెలలో బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది భారత్. ఆ తర్వాత ఏడాది ఆఖరి వరకు వరుస సిరీస్​లు ఉన్నాయి. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్​లు ఎక్కువగా ఆడనుంది టీమిండియా. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు కూడా వెళ్లనుంది. వచ్చే ఏడాది మొదట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాగూ ఉండనుంది. దీంతో సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా పూర్తి ఫిట్​నెస్​తో ఉండేలా ప్లాన్ చేస్తోందట బోర్డు. వీళ్లు గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట. సాధ్యమైనంత విశ్రాంతి ఇస్తూ ఫిట్​గా ఉండేలా చూసుకుంటోందట. మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దులీప్ ట్రోఫీలో ఆడకుండా ఈ ముగ్గురు స్టార్లను టీమ్స్​లోకి ఎంపిక చేయలేదని వినిపిస్తోంది. ఇక మీదట ఆడే సిరీస్​ల్లోనూ కీలక మ్యాచుల్లో మాత్రమే వీళ్లను ఆడించాలని భావిస్తున్నట్లు టాక్. మరి.. రోహిత్, కోహ్లీ, బుమ్రాలు దులీప్ ట్రోఫీలో ఆడకపోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.