iDreamPost
android-app
ios-app

Rohit Sharma, Virat Kohli: విరాట్‌ కోహ్లీ-రోహిత్‌ శర్మ సత్తాకు ఇది అగ్ని పరీక్ష! ఫెయిలైతే..?

  • Published Jan 11, 2024 | 4:15 PM Updated Updated Jan 11, 2024 | 4:15 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొబోతున్నారు. అందులో సక్సెస్‌ అయితే ఓకే.. లేదంటే మాత్రం ఊహించని విధంగా జట్టులో మార్పుల జరిగే అవకాశం ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొబోతున్నారు. అందులో సక్సెస్‌ అయితే ఓకే.. లేదంటే మాత్రం ఊహించని విధంగా జట్టులో మార్పుల జరిగే అవకాశం ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 11, 2024 | 4:15 PMUpdated Jan 11, 2024 | 4:15 PM
Rohit Sharma, Virat Kohli: విరాట్‌ కోహ్లీ-రోహిత్‌ శర్మ సత్తాకు ఇది అగ్ని పరీక్ష! ఫెయిలైతే..?

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టీమిండియాకు రెండు కళ్లలాంటి ఆటగాళ్లు. ప్రస్తుతం వీరిద్దరే జట్టును ముందుండి నడిపిస్తున్నారు. టెస్టుల్లో, వన్డేల్లో టీమిండియా తరఫున మంచి ర్యాంకుల్లో ఉన్నారు. అలాగే ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లోనూ వీరిద్దరు అద్భుతంగా రాణించారు. రోహిత్‌ ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించి.. పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం, తర్వాత విరాట్‌ కోహ్లీ దాన్ని కొనసాగించి.. లాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆడుతూ ఇతర బ్యాటర్లలో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం ఇదే.. టీమిండియా ప్రధాన వ్యూహ్యంగా వరల్డ్‌ కప్‌ సాగింది. ఈ సక్సెస్‌ స్ట్రాటజీతోనే వరల్డ్‌ కప్‌ ఆసాంతం టీమిండియా అదరగొట్టింది. కేవలం ఒక్క ఓటమితో వరల్డ్‌ కప్‌ను చేజార్చుకున్నా.. టీమిండియా ప్రదర్శనపై ప్రశంసలే కురిశాయి.

అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ ఓటమి అందరికంటే ఎక్కువగా రోహిత్‌​ శర్మ, విరాట్‌ కోహ్లీలనే ఎక్కువగా బాధించిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్లిద్దరు వరల్డ్‌ కప్‌ కోసం చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు. ఒక ఆటగాడిగా వరల్డ్‌ కప్‌ గెలవడం వేరు.. కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌ ఎత్తడం వేరు. 2019లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌ గెలవాలని ఎంతో ఆశపడ్డాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. అలాగే ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ కచ్చితంగా కప్పు ఎత్తుతాడని క్రికెట్‌ అభిమానులంతా బలంగా నమ్మారు. రోహిత్‌ కూడా చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. కానీ, చివరి మెట్టుపై అది చేజారింది. వాళ్లిద్దరు వరల్డ్‌ కప్‌ ఓటమి బాధలో ఉండగా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆడతారా? లేదా అనే చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌లను ఎంపిక చేయడంతో పాటు రోహిత్‌కే కెప్టెన్సీకి బాధ్యతలు అప్పగించడంతో వారిద్దరూ.. టీ20ల్లోనూ కొనసాగుతారని, టీ20 వరల్డ్‌ కప్‌ ఆడతారని ఫిక్స్‌ అయిపోయారు. అయితే.. ఈ సిరీస్‌ వారి టీ20 సత్తా నిరూపించుకోవడానికి షాకింగ్‌ విషయం తెలుస్తుంది. ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ రాణిస్తేనే.. టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో వారి ప్లేస్‌ ఖాయం అవుతుందని.. లేదంటే.. ఈ సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ఇదొక్కటే టీ20 సిరీస్‌ కావడంతో ఇందులో రాణించిన వారికే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరి కోహ్లీ, రోహిత్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు ఇలా టెస్ట్‌ లాంటి సిరీస్‌ సెట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.