SNP
Rohit Sharma, Virat Kohli, Gautam Gambhir, IND vs SL: టీమిండియాకు రెండు కళ్లలాంటి వాళ్ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఈ రెండు కాకుండా టీమిండియాకు మూడో కన్ను వచ్చింది. దాని పేరు గంభీర్. ఆ మూడో కన్నుకు రోహిత్, కోహ్లీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Virat Kohli, Gautam Gambhir, IND vs SL: టీమిండియాకు రెండు కళ్లలాంటి వాళ్ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఈ రెండు కాకుండా టీమిండియాకు మూడో కన్ను వచ్చింది. దాని పేరు గంభీర్. ఆ మూడో కన్నుకు రోహిత్, కోహ్లీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వస్తే.. చాలా మార్పులు జరుగుతాయని, టీమ్ పూర్తిగా అతని కంట్రోల్‌లోకి వెళ్తుందని, ఒక విధంగా చెప్పాలంటే భారత క్రికెట్‌లో అతని రాజ్యం నడవడం ఖాయమని అంతా భావించారు. అంతా అనుకున్నట్లుగానే.. గంభీర్ తన మార్క్ చూపిస్తున్నాడు. హెడ్ కోచ్‌గా నియామకం జరిగి.. ఇంకా ఫీల్డ్‌లోకి దిగకుండానే స్టార్ క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లకు షాకిచ్చాడు. అలాగే కొంతమంది కుర్రాళ్లు సర్‌ప్రైజ్ కూడా ఇచ్చాడు. మరో సంచలన విషయం ఏమిటంటే.. గంభీర్ ఏకంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే భయపెట్టినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగో టీ20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి.. కాస్త రెస్ట్ తీసుకోని న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి దిగాలని రోహిత్, కోహ్లీ భావించినట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంక పర్యటనకు దూరంగా ఉండాలని అనుకున్నారు. కానీ, గౌతమ్ గంభీర్ మాత్రం వాళ్లు శ్రీలంకతో సిరీస్ ఆడాల్సిందే అని పట్టుబట్టడంతో బీసీసీఐ కూడా వాళ్లిద్దరికీ సిరీస్ ఆడాలని సూచించింది.
ఇప్పుడు శ్రీలంకతో సిరీస్ ఆడకుంటే.. భవిష్యత్తులో గంభీర్‌తో ఇబ్బందులు తప్పవని, పైగా కుర్రాళ్లు అదరగొడుతున్న ఈ సమయంలో తాము రెస్ట్ మూడ్‌లో ఉంటే తమ ప్లేసులు గల్లంతు అయ్యే ప్రమాదం ఉందని భావించిన రోహిత్, కోహ్లీ.. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైపోయారు. పాత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉండి ఉంటే.. కచ్చితంగా రోహిత్, కోహ్లీ రెస్ట్ తీసుకునే వారని, కానీ, గంభీర్ హెడ్ కోచ్ కావడంతోనే వాళ్లిద్దరూ ఆడుతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విధంగా చెప్పాలంటే.. వాళ్లిద్దరూ గంభీర్‌కు భయపడ్డారని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. మరి ఈ విషయంలో ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024