ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్! రోహిత్‌తో పాటు సూర్య కూడా బయటికి?

Rohit Sharma, Suryakumar Yadav, Mumbai Indians, IPL 2025: వచ్చే ఐపీఎల్‌ కోసం జరిగే మెగా వేలానికి కంటే ముందే.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌, సూర్య షాక్‌ ఇవ్వనున్నారు. వాళ్లిద్దరు ముంబై నుంచి బయటికి రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Suryakumar Yadav, Mumbai Indians, IPL 2025: వచ్చే ఐపీఎల్‌ కోసం జరిగే మెగా వేలానికి కంటే ముందే.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌, సూర్య షాక్‌ ఇవ్వనున్నారు. వాళ్లిద్దరు ముంబై నుంచి బయటికి రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాకు సంబంధించిన అన్ని విషయాలు దాదాపు క్లియర్‌ అయిపోయాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. టీ20లకు కొత్త కెప్టెన్‌ ఎవరు అవుతారా? రోహిత్‌, కోహ్లీ ప్లేస్‌లు ఎవరు ఆక్రమిస్తారని క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వీటికి కొంతవరకు బీసీసీఐ సమాధానం చెప్పేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ను రోహిత్‌ వారుసుడిగా టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించింది. టీమిండియా కథ అలా ఉంటే.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ కంటే ముందు మెగా వేలం ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని టీమ్స్‌లో భారీ మార్పులు సంభవించే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌కు కూడా భారీ షాకిచ్చేందుకు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెడీ అయినట్లు సమాచారం. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్.. ఇద్దరు ఒకే సారి ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వేళ అదే జరిగితే.. ముంబై ఇండియన్స్‌కు అది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్‌లో గ్రేటెస్ట్‌ కెప్టెన్‌గా ఉన్నాడు రోహిత్‌. ఆ జట్టుకు ఏకంగా 5 కప్పులు అందించాడు. అలాగే సూర్యకుమార్‌ కూడా ముంబైకి ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు.

అయితే.. ఐపీఎల్‌ 2024 కంటే ముందు.. హార్ధిక్‌ పాండ్యాను తిరిగి టీమ్‌లోకి తీసుకోవడమే కాకుండా.. తనను తప్పించి పాండ్యాను కెప్టెన్‌ చేయడంతో రోహిత్‌ తీవ్రంగా హర్ట్‌ అయ్యాడు. అందుకే ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రోహిత్‌ బాటలోనే సూర్య కూడా ఉన్నాడు. ఐపీఎల్‌ 2025 కోసం తమను రీటెన్‌ చేసుకుంటాం అని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ అడిగినా.. అందుకు ఇద్దరు నో చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే.. రోహిత్‌ శర్మ, సూర్య ఇద్దరిలో ఒకరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదా లక్నో సూపర్‌ జెయింట్స్‌కు అయినా వెళ్లొచ్చు. మరి రోహిత్‌, సూర్య ముంబైని వదిలేస్తున్నారనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments