SNP
SNP
వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. మంచి స్టార్‌తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్-మొహమ్మద్ రిజ్వాన్ మంచి పార్ట్నర్‌షిప్‌తో భారీ స్కోర్ సాధించేలా కనిపించిన పాకిస్థాన్‌ను.. టీమిండియా బౌలర్లు చావుదెబ్బతీశారు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ బ్రేక్స్ తర్వాత వేసిన 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి పాక్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో.. 155 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశ నుంచి కొద్ది సేపటిలోనే 191 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 36 రన్స్ వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోయిన పాక్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా తొలి వికెట్ గురించి మాట్లాడుకోవాలి.
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను సిరాజ్ లెగ్ బిఫోర్‌గా అవుట్ చేశాడు. ఈ వికెట్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి పడింది. అయితే.. అంతవరకు సిరాజ్ చాలా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన వేసిన తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు ఇచ్చుకున్నాడు. దీంతో సిరాజ్ అంత కాన్ఫిడెంట్‌గా కనిపించలేదు. దీంతో.. కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు సిరాజ్‌తో మాట్లాడి అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే.. సిరాజ్‌తో కెప్టెన్ రోహత్ శర్మ మాట్లాడిన తర్వాత.. సిరాజ్‌కే కాదు టీమిండియాకు ఎంతో కలిసొచ్చింది. సిరాజ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేస్తున్న క్రమంలో చివరి బాల్ మిగిలి ఉన్న సమయంలో రోహిత్ శర్మ వెళ్లి సిరాజ్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఆ వెంటనే ఫీల్డ్‌లో కూడా మార్పులు చేశాడు.
షార్ట్ పిచ్ బాల్ కోసం ఫీల్డ్ సెట్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. షార్ట్ పిచ్ బాల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. కానీ, సిరాజ్ మాత్రం షార్ట్ పిచ్ బాల్ వేయకుండా.. క్రాస్ సీమ్ డెలివరీ వేశాడు. దీంతో ఖంగుతిన్న అబ్దుల్లా షఫీక్ కనెక్ట్ బాల్‌ను చేయలేకపోయాడు. దాంతో అతను వికెట్ల ముందు దొరికిపోయి.. ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి టీమిండియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ.. పాకిస్థాన్‌ను కోలుకోకుండా చేశారు. అయితే.. షఫీక్‌ను అవుట్ చేసేందుకు రోహిత్ శర్మ-సిరాజ్ నాటకం ఆడి.. చాలా దారుణంగా మోసం చేశారంటూ.. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరి మాస్టర్ ప్లాన్‌కు షఫీక్ చిక్కాడంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Talked with the siraj & the next ball he took wicket!!
Rohit Sharma The CAPTAIN!!🔥#INDvsPAK pic.twitter.com/71jdAuQoVU
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) October 14, 2023
ఇదీ చదవండి: ఇండియా-పాక్ మ్యాచ్.. తొలి ఓవర్ లోనే రికార్డు బ్రేక్!