SNP
టీమిండియా సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆఫ్ఘాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. అయితే.. కేవలం 30 బంతుల్లోనే 103 పరుగులు రావడం విశేషం. అదేలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా సూపర్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆఫ్ఘాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. అయితే.. కేవలం 30 బంతుల్లోనే 103 పరుగులు రావడం విశేషం. అదేలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం..
SNP
నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని ఘనటలు, కళ్లు చెదిరే ఫీల్డింగ్, భారీ షాట్లు.. ఇండియా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించింది. హైస్కోర్ మ్యాచ్‌గా సాగినా.. ఏకంగా రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. చివరికి టీమిండియానే విజయం సాధించి, సంచలనానికి తావు లేకుండా చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులు చేసి అదరగొట్టాడు.
తన ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులే చేసి అవుటైనా.. కింగ్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా.. గత రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన శివమ్ దూబే ఈ సారి ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినా.. సంజు శాంసన్ సైతం తొలి బంతికే అవుటై కేవలం 22 పరుగులకే 4 వికెట్లు పడినా.. రోహిత్ శర్మ మాత్రం ఒంటరిగా దండయాత్ర చేశాడు. ఆరంభంలో రోహిత్‌కు రింకూ మద్దతుగా నిలబడినా.. చివర్లో అతను కూడా భారీ షాట్లతో తనకు అలవాటైన హిట్టింగ్‌తో విరుచుకుపడ్డారు. ఇలా వీరిద్దరూ ఆఫ్ఘాన్ బౌలర్లను చీల్చిచెండాడారు. ఒక దశలో 150 కూడా చేస్తుందో లేదో అనుకున్న టీమిండియా ఏకంగా 212 పరుగులు చేసింది.
ఇంత భారీ స్కోర్ రావడానికి కారణం మాత్రం రోహిత్-రింకూలే. రోహిత్ సెంచరీతో చెలరేగితే.. రింకూ 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 69 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ కేవలం 109 మాత్రమే.. కానీ, అక్కడ నుంచి రోహిత్-రింకూ ఊచకోత మొదలైంది. 16వ ఓవర్‌లో 22, 17వ ఓవర్‌లో 13, 18 ఓవర్‌లో 10, 19వ ఓవర్‌లో 22, చివరిదైన 20వ ఓవర్‌లో 36 పరుగులు చేసి.. ఏకంగా 30 బంతుల్లోనే 103 పరుగులు సాధించి.. విధ్వంసం సృష్టించారు. కేవలం 5 ఓవర్లలోనే 103 పరుగులు చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే.. ఇంత భారీ స్కోర్ చేసినా మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు దారి తీసింది. అయినా కూడా చివరికి టీమిండియా విజయం సాధించడం విశేషం. మరి ఈ మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లలో రోహిత్-రింకూ జోడి 103 పరుగులు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
16th over – 22 runs.
17th over – 13 runs.
18th over – 10 runs.
19th over – 22 runs.
20th over – 36 runs.India scored 103 runs in the last 5 overs – Madness from Rinku and Rohit. 🤯🔥 pic.twitter.com/DtbZPdeIRJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2024