SNP
Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తమ ఈగోలను పక్కనపెట్టి కలిసిపోయారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పరిస్థితి మారిపోయేలా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తమ ఈగోలను పక్కనపెట్టి కలిసిపోయారు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా ఉంది ముంబై ఇండియన్స్. కానీ, గత మూడు సీజన్లుగా ముంబై పరిస్థితి అంత ఏం బాగాలేదు. ప్రదర్శన గురించి పక్కపెడితే.. ముంబై ఇండియన్స్‌లో అంతర్గతంగా చాలా తతంగం నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి అసలు ఆ టీమ్‌లో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి, భారీ స్టార్‌డమ్ కలిగిన క్రికెటర్, అన్నింటికంటే మించి ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మను తీసేసి.. అతని స్థానంలో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ఇక్కడి నుంచి అసలు రచ్చ మొదలైంది.
ఐపీఎల్ 2022 సీజన్ కంటే ముందు ముంబై ఇండియన్స్‌ను వదిలిపెట్టి.. కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయిన పాండ్యా, మళ్లీ తిరిగి ఈ సీజన్‌తోనే ముంబైలోకి వచ్చాడు. డబ్బు కోసం ముంబై ఇండియన్స్‌ను వీడి వేరే టీమ్‌కి వెళ్లిన క్రికెటర్‌ను మళ్లీ తీసుకొచ్చి కెప్టెన్ చేయడం ఏంటని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాగే ముంబై ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మను బౌండరీ లైన్ వద్దకు ఫీల్డింగ్‌కు పంపడం కూడా పాండ్యాపై రోహిత్ ఫ్యాన్స్‌కు కోపం వచ్చేలా చేసింది. దాంతో.. రోహిత్ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పాండ్యాపై దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు.
ఒకవైపు బయట పాండ్యాను రోహిత్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటుంటే.. ముంబై ఇండియన్స్ టీమ్‌లో రెండు గ్రూపులు ఉన్నాయనే టాక్ బయటికి వచ్చింది. రోహిత్ శర్మ, హార్ధిక్‌పాండ్యా రెండు వేర్వేరు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారని, ఒకరి మాట ఒకరు వినడం లేదని, అందుకే ముంబై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైందని కొంతమంది క్రికెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో.. ముంబై వైఫల్యానికి రోహిత్ వర్సెస్ పాండ్యా ఫైటే కారణమని గుర్తించిన నీతా అంబానీ.. ఇద్దరిని కూర్చోబెట్టి ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత పాండ్యా, రోహిత్ వివాదాలు పక్కనపెట్టి.. టీమ్ కోసం కలిసిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ మొత్తం సరదాగా గడిపేందుకు ఓ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ రోహిత్, పాండ్యా ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని, ఇక ముంబై ఇండియన్స్‌ను ఎవరూ ఆపలేరంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma Handshakes with Hardik Pandya.pic.twitter.com/M50BLyCkgn
— CricketGully (@thecricketgully) April 5, 2024
That’s one way to unwind and have some quality team time 🤩➡️ https://t.co/GyuukJgUDk
Catch it all on #MIDaily now, available on our website and MI app 📹💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/rwTLt8mMRi
— Mumbai Indians (@mipaltan) April 5, 2024