Nidhan
Rohit Sharma On Gautam Gambhir's Coaching Style: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.
Rohit Sharma On Gautam Gambhir's Coaching Style: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు. అందుకే అతడి ఆటతో పాటు వ్యక్తిత్వానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తాజాగా భారత నయా కోచ్ గౌతం గంభీర్ గురించి హిట్‌మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గురువారం నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెన్నైలోని చెపాక్ స్టేడియానికి ఐద్రోజుల కిందే చేరుకున్న మెన్ ఇన్ బ్లూ జోరుగా సాధన చేస్తోంది. ఫస్ట్ టెస్ట్‌కు టైమ్ దగ్గర పడటంతో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రోహిత్ గంభీర్‌తో పాటు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీతో గొడవలు ఉన్నాయా? అనే ప్రశ్నకు అతడు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అసలు రోహిత్ ఏమన్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త కోచ్ గంభీర్‌తో ఎలాంటి గొడవలు లేవన్నాడు రోహిత్. కానీ అతడి కోచింగ్ స్టైల్ మాత్రం డిఫరెంట్‌గా ఉందన్నాడు. అతడి రాకతో టీమ్ డైనమిక్స్ మారిపోయాయన్నాడు. టీమ్‌కు సంబంధించి ప్రతిదీ అర్థం చేసుకోవడం ముఖ్యమని.. తమ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందన్నాడు హిట్‌మ్యాన్. గంభీర్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ గురించి తనకు బాగా తెలుసునని చెప్పాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌ను ఎన్నో మ్యాచుల్లో ఎదుర్కొన్నానని చెప్పిన భారత కెప్టెన్.. అతడు చాలా టఫ్ బౌలర్ అని మెచ్చుకున్నాడు. మరో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డొషేట్తో ఎక్కువగా కలసి ఆడే అవకాశం రాలేదన్నాడు. అతడితో పని చేస్తుంటే మంచిగా అనిపిస్తోందన్నాడు. కొత్త కోచింగ్ స్టాఫ్‌తో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న రోహిత్.. కానీ వాళ్ల స్టైల్‌కు అలవాటు పడేందుకు టైమ్ తీసుకుంటున్నామని చెప్పాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలోని పాత కోచింగ్ స్టాఫ్‌తో పోల్చుకుంటే వీళ్లు చాలా డిఫరెంట్ అని తెలిపాడు.
శ్రీలంక సిరీస్‌తో జట్టు గురించి, ఆటగాళ్ల గురించి కొత్త కోచింగ్ స్టాఫ్ పూర్తిగా తెలుసుకున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీమ్‌కు సంబంధించిన విషయాలను వాళ్లు త్వరగా గ్రహిస్తూ, నేర్చుకుంటున్నారని తెలిపాడు. వాళ్లకో డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఉందన్నాడు. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది కోచ్‌లతో పని చేశానని.. ప్రతి ఒక్కరికీ ఒక యూనిక్ స్టైల్ ఉంటుందన్నాడు హిట్‌మ్యాన్. కోచింగ్ స్టాఫ్‌కు తగ్గట్లు ఆటగాళ్లు కూడా మారాలని, వాళ్ల స్టైల్‌ను అర్థం చేసుకొని ఛేంజెస్‌కు అలవాటు పడాలన్నాడు. తాము ప్రతి మ్యాచ్‌ను, ప్రతి సిరీస్‌ను అంతే కీలకంగా భావిస్తామని.. దేన్నీ లైట్ తీసుకోబోమన్నాడు. గెలుపే లక్ష్యంగా తన మైండ్ పని చేస్తుందన్నాడు రోహిత్. ఎలా గెలవాలి? నెగ్గేందుకు ఏమేం చేయగలం? అనే విషయాల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతుంటాయన్నాడు.
Rohit Sharma “I know Gautam Gambhir,Abhishek Nayar really well. Against Morne Morkel we have played some really tough cricket.Ryan I hadn’t much chance too but whatever I came to know about,he looks quite.we don’t have any issues as such, understanding is quite important and we… pic.twitter.com/8IxHZIY2mu
— Sujeet Suman (@sujeetsuman1991) September 17, 2024