Somesekhar
రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా గొడవ విషయంలో స్పందించాడు టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్. ఈ సందర్భంగా రోహిత్ ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా గొడవ విషయంలో స్పందించాడు టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్. ఈ సందర్భంగా రోహిత్ ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి వార్త రాని రోజంటూ లేదనుకుంటా. దానికి కారణం ఏంటో మనందరికి తెలిసిందే. క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు వచ్చిన పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలను అందించింది ఎంఐ యాజమాన్యం. దీంతో రోహిత్ శర్మ తీవ్ర మనసిక సంఘర్షణకు గురైయ్యాడు. ఇక ఈ ఘటనతో రోహిత్ ఫ్యాన్స్ పాండ్యాపై, ముంబై యాజమాన్యంపై కోపంతో ఊగిపోయారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు స్పందించారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్.
రోహిత్ శర్మ.. ఐదుసార్లు ముంబై ఇండియన్స్ ను ఛాంపియన్ గా నిలిపాడు. అలాంటి ఆటగాడిని కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అందించింది ముంబై. ఈ ఘటన ఐపీఎల్ తో పాటుగా టీమిండియా క్రికెట్ లో కూడా సంచలనం రేపింది. ఇక విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్, టీమిండియా మాజీ దిగ్గజం జహీర్ ఖాన్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఎలాంటి వాడో ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు జహీర్.
రోహిత్ శర్మ గురించి జహీర్ ఖాన్ మాట్లాడుతూ..”నేను ఇంతవరకు చూసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. పైగా ఎమోషనల్ పర్సన్. అతడు టీమిండియా తరఫున ఆడినా.. వేరే ఫ్రాంచైజీలకి ఆడినా తన ప్రాణం పెడతాడు. ఇప్పటికే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు. ఇది చిన్న విషయం కాదు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అతడిని మరింతగా భావోద్వేగాలకి గురిచేస్తున్నాయి” అంటూ జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రోహిత్ ను దగ్గర నుంచి చూశాడు కాబట్టే అతడి వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా అర్దం చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రోహిత్-పాండ్యా విషయంలో జహీర్ ఇలా స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: టీ20 వరల్డ్ కప్.. పంత్ రీ ఎంట్రీపై ఆందోళన పెడుతున్న జై షా వ్యాఖ్యలు!