iDreamPost
android-app
ios-app

Gautam Gambhir: ఓటమి బాధతో ఏడుస్తూ నిద్రపోలేదు.. అప్పుడే వరల్డ్ కప్ నెగ్గాలని ఫిక్స్ అయ్యా: గంభీర్

  • Published Jul 03, 2024 | 5:06 PM Updated Updated Jul 03, 2024 | 5:06 PM

పొట్టి కప్పును కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరడంతో మన టీమ్ ఫ్యాన్స్​ సంతోషంలో మునిగిపోయారు. ఈ తరుణంలో లెజెండ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పొట్టి కప్పును కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. ఎన్నో ఏళ్ల కల నెరవేరడంతో మన టీమ్ ఫ్యాన్స్​ సంతోషంలో మునిగిపోయారు. ఈ తరుణంలో లెజెండ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jul 03, 2024 | 5:06 PMUpdated Jul 03, 2024 | 5:06 PM
Gautam Gambhir: ఓటమి బాధతో ఏడుస్తూ నిద్రపోలేదు.. అప్పుడే వరల్డ్ కప్ నెగ్గాలని ఫిక్స్ అయ్యా: గంభీర్

అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగిన పొట్టి కప్పును కైవసం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్​లో ఉంది. ఎన్నో ఏళ్ల కప్పు కల తీరడంతో మన టీమ్ ఫ్యాన్స్​ సంతోషంలో మునిగిపోయారు. ఓవరాల్​గా భారత్ సాధించిన నాలుగో వరల్డ్ కప్​గా ఇది నిలిచింది. 1983లో కపిల్ డెవిల్స్, 2007, 2011లో ధోని నాయకత్వంలోని జట్లు ప్రపంచ కప్​ను ముద్దాడాయి. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో నాలుగో కప్పును అందుకుంది. అయితే కపిల్ దేవ్ లీడర్​షిప్​లో గెలిచాక దాదాపుగా 24 ఏళ్లు జట్టుకు కప్పు రాలేదు. ద్వైపాక్షిక టోర్నమెంట్​లు, మూగ్నాలుగు దేశాలతో జరిగే సిరీస్​ల్లో గెలిచినా మెగాటోర్నీలో మాత్రం విజేతగా నిలిచింది లేదు. పలుమార్లు సెమీస్, ఫైనల్ వరకు వెళ్లినా ఖాళీ చేతులతోనే తిరిగొచ్చేసింది. దీంతో అభిమానులు కప్పు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తూ వచ్చారు.

ఆ టైమ్​లో లెజెండ్ గౌతం గంభీర్ కూడా ఎంతో బాధపడ్డాడట. ముఖ్యంగా 1992 వరల్డ్ కప్​ లీగ్ స్టేజ్​లో భారత్ ఇంటిదారి పట్టడంతో గౌతీ కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో టీమిండియా ఓడటంతో గంభీర్​కు ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదట. అప్పుడు తనకు 11 ఏళ్లు అని.. ఆ రోజే భారత్ కోసం వరల్డ్ కప్ గెలవాలని ప్రతిజ్ఞ చేశానని అతడు గుర్తుచేసుకున్నాడు. ‘భారత్-ఆసీస్ మ్యాచ్ చూశాక నేను బాగా ఏడ్చాను. ఆ రోజంతా నిద్రపట్టలేదు. టీమిండియా చివరి వరకు పోరాడినా ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది. ఆ రోజు ఎంత ఏడ్చానో చెప్పలేను. అంతలా బాధపడిన రోజు మరొకటి లేదు. అప్పుడే దేశానికి కప్పు అందించాలని ఫిక్స్ అయ్యా’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలనే తన డ్రీమ్ 2011 ప్రపంచ కప్​తో నెరవేరిందన్నాడు గంభీర్. అంతకుముందే టీ20 వరల్డ్ కప్-2007ను గెలుచుకుంది భారత్. అయితే వన్డే కప్పును మాత్రం 2011లో ఒడిసిపట్టింది. ఈ రెండు మెగాటోర్నీల్లోనూ జట్టు విజయంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 కప్పులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. 2011 వరల్డ్ కప్​ ఫైనల్​లో శ్రీలంక మీద 97 పరుగులు చేసి టీమ్ సక్సెస్​లో ముఖ్య భూమిక వహించాడు. అలాంటోడు త్వరలో భారత జట్టు కోచ్​గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. భారత క్రికెట్ బోర్డు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ గౌతీ కోచ్​గా రావడం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. మరి.. కోచ్​గా గంభీర్ రాక కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.