iDreamPost
android-app
ios-app

BCCIపై ఫైర్ అయిన ఊతప్ప.. అన్యాయం చేస్తున్నారంటూ..!

  • Author Soma Sekhar Published - 06:10 PM, Thu - 10 August 23
  • Author Soma Sekhar Published - 06:10 PM, Thu - 10 August 23
BCCIపై ఫైర్ అయిన ఊతప్ప.. అన్యాయం చేస్తున్నారంటూ..!

టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప బీసీసీఐపై ఫైర్ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆటగాళ్లను ఇది చేయోద్దు, అది చేయోద్దు.. అందులో ఆడొద్దు అనడం కరెక్ట్ కాదు. ఇది మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా మా స్వేచ్ఛను హరించినట్లే అని మండిపడ్డాడు ఈ మాజీ క్రికెటర్. మరి ఇంతలా బీసీసీఐపై ఊతప్ప విరుచుకుపడటానికి కారణం ఏంటంటే? త్వరలోనే బీసీసీఐ ఓ కొత్తరూల్ ను తేబోతోందట. ఆ రూల్ తో టీమిండియా ఆటగాళ్లతో పాటుగా మాజీ ప్లేయర్లకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఊతప్ప చెప్పుకొస్తున్నాడు. మరి ఇంతకీ బీసీసీఐ తేబోతున్న ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో దేశవాళీ టోర్నీలను కాపాడేందుకు, ఐపీఎల్ క్రేజ్ తగ్గకుండా చూసుకునేందుకు బీసీసీఐ ఓ రూల్ ను ఇదివరకే తీసుకొచ్చింది. ఈ రూల్ లో భాగంగా.. టీమిండియా క్రికెటర్లు విదేశీ లీగుల్లో పాల్గొనకూడదనేది ఆ రూల్ సారాంశం. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. మరో కొత్త రూల్ ను తేబోతుందట బీసీసీఐ. ఆ రూల్ ఏంటంటే? రిటైర్మెంట్ అయిన టీమిండియా క్రికెటర్లు సైతం విదేశీ లీగుల్లో ఆడటానికి వీలులేకుండా ఓ రూల్ ను తేనుందట. ఇక ఈ విషయం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా.. విదేశీ లీగుల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో.. చాలా మంది ఆటగాళ్లు 33-34 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఈ విధమైన ముందస్తు రిటైర్మెంట్ తగ్గించేందుకు బీసీసీఐ కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీంతో బీసీసీఐ తేనున్న ఈ రూల్ పై తీవ్రంగా మండిపడ్డాడు భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ..”BCCI తీసుకురావాలని చూస్తున్న కొత్త రూల్ అన్యాయం. ఇది మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇది చేయోద్దు, ఆ లీగ్ లో ఆడొద్దు అని చెప్పడం ఏంటి? బీసీసీఐ నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ లేనప్పుడు, భారత క్రికెట్ కు ఆడనప్పుడు.. మేం ఎక్కడ ఆడితే ఏంటి? ఇలాంటి నిర్ణయాలు మా స్వేచ్చను దెబ్బతీస్తాయి” అంటూ ఘాటుగా స్పందించాడు ఊతప్ప.

ఈ క్రమంలోనే రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు కూడా విదేశీ లీగుల్లో పాల్గొన కుండా బీసీసీఐ తెచ్చే ఇలాంటి పాలసీలను అమలు చేసేటప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పరిగణంలోకి తీసుకుంటుందని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు ఊతప్ప. కాగా.. ఐపీఎల్ లో అమ్ముడు పోనీ ఆటగాళ్లు విదేశీ లీగ్ లకు వెళ్తే తప్పేముందని కామెంట్స్ చేశాడు రాబిన్. మరి బీసీసీఐపై రాబిన్ ఊతప్ప ఫైర్ అవ్వడంలో న్యాయం ఉందా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. చరిత్రలో తొలిసారి ఇలా..