iDreamPost
android-app
ios-app

ఆ వీడియోలు చూస్కో అంటూ పరాగ్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌! కారణం ఏంటంటే?

  • Published Jun 03, 2024 | 12:27 PM Updated Updated Jun 03, 2024 | 12:27 PM

Riyan Parag, T20 World Cup 2024: భారత యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌పై మరోసారి భారీ స్థాయిలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇంతకీ అతను మళ్లీకి ట్రోలింగ్‌కి ఎందుకు గురి అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Riyan Parag, T20 World Cup 2024: భారత యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌పై మరోసారి భారీ స్థాయిలో ట్రోలింగ్‌ జరుగుతోంది. ఇంతకీ అతను మళ్లీకి ట్రోలింగ్‌కి ఎందుకు గురి అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 03, 2024 | 12:27 PMUpdated Jun 03, 2024 | 12:27 PM
ఆ వీడియోలు చూస్కో అంటూ పరాగ్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌! కారణం ఏంటంటే?

యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ గురించి భారత క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా ఏళ్లుగా ఈ యంగ్‌ ప్లేయర్‌ అందరికి సుపరిచితమే. ఆరంభంలో ఆట తక్కువ ఓవర్‌ యాక్షన్‌ ఎక్కువ చేస్తూ.. ఓవర్‌యాక్షన్‌ స్టార్‌లా ముద్ర వేయించుకున్నాడు. కానీ, తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2024 సీజన్‌లో మంచి ఆటతో అబ్బో.. ఆటగాడే అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యేలా చేశాడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్‌లోనూ అద్భుతంగా రాణిస్తూ.. టీమిండియా ఫ్యూచర్‌ స్టార్‌లా కనిపించాడు. అయితే.. తాజాగా రియాన్‌ పరాగ్‌ చేసిన ఓ కామెంట్‌ అతన్ని మళ్లీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యేలా చేసింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో సెమీ ఫైనల్‌కు వెళ్లే నాలుగు టీమ్‌ ఏవి అని మీరు అనుకుంటున్నారు అని ఎదురైన ప్రశ్నకు రియాన్‌ పరాగ్‌ బదులిస్తూ.. దాని గురించి నేను ఆలోచించడం లేదు, నిజం చెప్పాలంటే నేను ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీ చూడాలని అనుకోవడం కూడా లేదు. ఎవరు గెలుస్తున్నారు.. అనే విషయం మాత్రం తెలుసుకుంటా.. నేను వరల్డ్‌ కప్‌ ఆడే టైమ్‌లో ఏ నాలుగు టీమ్స్‌ సెమీస్‌ వెళ్తాయి అనే విషయాల గురించి ఆలోచిస్తా అంటూ పరాగ్‌ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు పరాగ్‌ను ఏకిపారేస్తున్నారు.

‘నువ్వు మ్యాచ్‌లు ఎందుకు చూస్తావ్‌? అలాంటి వీడియోలు అయితే చూస్తావ్‌!’, ‘ఆ వీడియోలే చూస్కో’ అంటూ నెటిజన్లు పరాగ్‌పై ట్రోలింగ్‌కు దిగారు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత పరాగ్‌ లైవ్‌లోకి వచ్చిన తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో అదే లైవ్‌లో తన యూబ్యూబ్‌లో ఏదో సెర్చ్‌ చేయబోయాడు. ఇంతలో తన సెర్చ్‌ హిస్టరీ మొత్తం కింది డిస్‌ప్లే అయింది. అందులో.. ‘సారా అలీ ఖాన్‌ హాట్‌, అనన్య పాండే హాట్‌’ ‘విరాట్‌ కోహ్లీ’ అనే సజెషన్స్‌ కూడా ఉన్నాయి. వీటిపై కూడా పరాగ్‌పై ట్రోలింగ్‌ జరిగింది. కుర్రాడు మంచి ఆటగాడే అంటూ నెటిజన్లు అతన్ని ట్రోల్‌ చేశారు. తాజాగా నేను టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూడాలని అనుకోవడం లేదని పరాగ్‌ అనడంతో.. అయితే ఆ వీడియోలే చూస్కో అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.