Nidhan
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌తో భారత్‌కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌తో భారత్‌కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది.
Nidhan
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌తో భారత్‌కు ఎన్నో ప్లస్ పాయింట్లు లభించాయి. సిరీస్ సొంతమవడం, ఆటగాళ్లంతా రాణించడంతో టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ హ్యాపీగా ఉంది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా రాణిస్తుండటంతో సంతోషంగా ఉంది. బ్యాటింగ్‌లో టచ్‌లోకి వచ్చిన పాండ్యా బౌలింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. అతడితో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కూడా బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. పేసర్లలో అర్ష్‌దీప్ సింగ్ అవసరమైన టైమ్‌లో బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. ఇలా చాలా మంది ప్లేయర్లు అంచనాలకు తగ్గట్లు పెర్ఫార్మ్ చేస్తుండటంతో భారత్‌కు తిరుగుండటం లేదు. అయితే ఒక ప్లేయర్ మాత్రం నిరాశపరిచాడు.
బ్యాటర్ సంజూ శాంసన్‌కు టీమ్‌లో సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శల మధ్య రెండో టీ20లో ఛాన్స్ ఇచ్చింది మేనేజ్మెంట్. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్లేస్‌లో అతడ్ని ఆడించింది. కానీ ఆడిన తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు శాంసన్. లేక లేక వచ్చిన అవకాశం నేలపాలు కావడంతో అతడికి మళ్లీ టీమ్‌లో ప్లేస్ కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జట్టులో అన్ని పొజిషన్స్‌కు యాప్ట్ ప్లేయర్లు ఉండటం, అందరూ ఫామ్‌లో ఉండటంతో సంజూకు ఇక చోటు కష్టమని అంటున్నారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. శాంసన్ పనైపోయిందని అన్నాడు. అతడి కంటే కొత్త కుర్రాడు రియాన్ పరాగ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని తెలిపాడు.
సంజూ స్థానంలో పరాగ్ టీమ్‌లో సెటిల్ అవడం ఖాయమన్నాడు పఠాన్. బ్యాట్‌తో పరుగులు చేయడంతో పాటు బంతితో బ్రేక్ త్రూలు అందించగల సత్తా అతడికి ఉందన్నాడు. ‘బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది గనుక పరాగ్‌కు ఇకపై మరిన్ని ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ అతడిలా బాగా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్లు మన దేశంలో చాలా అరుదు. ఇది పరాగ్‌కు అదనపు బలం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ రాణిస్తే ఫ్యూచర్లో టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ఎదిగొచ్చు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. లంక సిరీస్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా.. బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు పరాగ్. ఆఫ్ స్పిన్ డెలివరీస్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి టీ20లో 7 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. రెగ్యులర్ స్పిన్నర్ల కంటే అతడు వేసే బంతులు ఎక్కువగా స్పిన్ అవుతుండటం గమనార్హం. మరి.. సంజూ స్థానంలో పరాగ్ టీమ్‌లో సెట్ అవుతాడనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Irfan Pathan said, “You will see Riyan Parag getting many chances due to his bowling ability. As a top-order batsman, not many in the country have the ability to roll their arm over. This is where Riyan Parag will get an extra advantage, and rightly so.” pic.twitter.com/qmo7Ci2Q2h
— Cricket Chamber (@cricketchamber) July 29, 2024