Nidhan
TNPL 2024: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ కుర్రాడు షాకిచ్చాడు. అశ్విన్ ట్రిక్‌ను అతడి మీదే ప్రయోగించాడు.
TNPL 2024: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ కుర్రాడు షాకిచ్చాడు. అశ్విన్ ట్రిక్‌ను అతడి మీదే ప్రయోగించాడు.
Nidhan
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. భారత జట్టు తరఫున టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న అశ్విన్ మిగతా రెండు ఫార్మాట్లకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన అశ్విన్.. టీ20ల్లో కనిపించి చాలా టైమ్ అయింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ లాంటి యంగ్‌స్టర్స్ దూసుకురావడంతో అశ్విన్‌ను టెస్ట్ స్పెషలిస్ట్‌గా పరిమితం చేసింది బోర్డు. అయితే భారత మ్యాచ్‌లతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న అతడు.. మిగతా టైమ్‌లోనూ ఖాళీగా ఉండటం లేదు. ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ అందర్నీ అలరిస్తున్నాడు.
టీఎన్‌పీఎల్‌లో ఆడుతున్న అశ్విన్‌కు ఓ కుర్రాడు షాకిచ్చాడు. మన్కడింగ్ స్పెషలిస్ట్ అయిన అశ్విన్‌కే ఆ బౌలర్ మన్కడింగ్ రుచి చూపించాడు. బాల్ వేయకముందే క్రీజును దాటుతుంటే వార్నింగ్ ఇచ్చాడు. సాధారణంగా మన్కడింగ్ పేరు చెబితే క్రికెట్ లవర్స్‌కు అశ్విన్ పేరే గుర్తుకొస్తుంది. తన బౌలింగ్‌లో ఈ రూల్ కారణంగా పలువురు నాన్‌స్ట్రయికర్ బ్యాటర్స్‌ను అతడు ఔట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్లో కూడా మన్కడింగ్‌తో పలువుర్ని అశ్విన్ ఔట్ చేశాడు. అలాంటి దిగ్గజ బౌలర్‌కు ఓ కుర్రాడు ఝలక్ ఇచ్చాడు. అశ్విన్ ట్రిక్‌ను అతడి మీదే ప్రయోగించాడు. టీఎన్‌పీఎల్‌లో భాగంగా దిండిగల్ డ్రాగన్స్, నెల్లాయ్ రాయల్ కింగ్స్ టీమ్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో దిండిగల్ బౌలర్ మోహన్ ప్రశాంత్ 15వ ఓవర్ వేశాడు.
బౌలింగ్ చేసేందుకు వచ్చిన మోహన్ ప్రశాంత్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న అశ్విన్ క్రీజును దాటే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన బౌలర్ బౌలింగ్ ఆపి అశ్విన్‌ను హెచ్చరించాడు. ఈ విషయాన్ని అంపైర్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో అశ్విన్ షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బౌలర్ సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడం, అశ్విన్ షాక్ అవ్వడం, కామెంటేటర్లు నవ్విన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. నువ్వు నేర్పిన విద్యే కదా అని అశ్విన్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఆ బౌలర్ మామూలోడు కాదని.. ఎలాంటి తడబాటు లేకుండా లెజెండరీ ప్లేయర్ దగ్గరకు వెళ్లి హెచ్చరించడం గ్రేట్ అని అంటున్నారు. మరి.. అశ్విన్ ట్రిక్‌ను అతడి మీదే బౌలర్ ప్రయోగించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.