iDreamPost
android-app
ios-app

Rishabh Pant: వీడియో: పంత్ స్టన్నింగ్ క్యాచ్.. ఇది చూసి తీరాల్సిన ఔట్!

  • Published Sep 08, 2024 | 5:16 PM Updated Updated Sep 08, 2024 | 7:22 PM

Rishabh Pant, Duleep Trophy 2024, IND B vs IND A: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫ్లయింగ్ క్యాచ్​తో అదరగొట్టాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్​ను అందుకున్నాడు.

Rishabh Pant, Duleep Trophy 2024, IND B vs IND A: దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫ్లయింగ్ క్యాచ్​తో అదరగొట్టాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్​ను అందుకున్నాడు.

  • Published Sep 08, 2024 | 5:16 PMUpdated Sep 08, 2024 | 7:22 PM
Rishabh Pant: వీడియో: పంత్ స్టన్నింగ్ క్యాచ్.. ఇది చూసి తీరాల్సిన ఔట్!

టీమిండియా మ్యాచ్​లు లేకపోవడంతో క్రికెట్ లవర్స్ అంతా దులీప్ ట్రోఫీ-2024 చూస్తూ బిజీ అయిపోయారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా లాంటి కొందరు బడా స్టార్లు మినహా అందరు భారత ఆటగాళ్లు ఇందులో ఆడుతుండటంతో టోర్నీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్లే టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. భారత టెస్ట్ టీమ్​లోకి వచ్చేందుకు ఫామ్, ఫిట్​నెస్​ ప్రూవ్ చేసుకోవడం తప్పనిసరి కావడంతో ప్లేయర్లంతా తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఓపెనింగ్ మ్యాచ్​లోనే సూపర్బ్ నాక్స్, మెరుపు ఇన్నింగ్స్​లు, స్టన్నింగ్స్ స్పెల్స్ చూస్తున్నాం. టోర్నీలో కొన్ని బ్రిలియంట్ క్యాచెస్ కూడా నమోదవుతున్నాయి. తాజాగా ఇండియా బీ కీపర్ రిషబ్ పంత్ మరో స్పెక్టాక్యులర్ క్యాచ్​తో అందర్నీ షాక్​కు గురిచేశాడు.

దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్​లో మరో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఇండియా బీ కీపర్ పంత్ అద్భుతమైన ఫ్లయింగ్ క్యాచ్​తో అదరగొట్టాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ అతడు అందుకున్న క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెటరన్ పేసర్ నవ్​దీప్ సైనీ బౌలింగ్​లో లెగ్ స్టంప్ మీద పడిన బంతిని బ్యాటర్ ఆవేశ్ ఖాన్ షాట్​గా మలిచేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ల వెనుక కాచుకొని ఉన్న పంత్​కు దూరంగా వెళ్లింది. అయితే దాన్ని ఎలాగైనా పట్టితీరాలనుకున్న స్టార్ కీపర్.. అమాంతం గాల్లోకి ఎగిరాడు. బాల్​ను సమీపించి రెండు చేతులతో దాన్ని ఒడిసిపట్టాడు. ఆ టైమ్​లో అతడి శరీరం మొత్తం గాల్లోనే ఉంది. క్యాచ్ అందుకున్నా అంతే జాగ్రత్తగా కిందకు ల్యాండ్ అయ్యాడు. ఈ సూపర్ క్యాచ్ చూసి ఆవేశ్ ఖాన్ సహా ఇండియా బీ టీమ్ ప్లేయర్లు కూడా షాక్ అయ్యారు.

బాల్ వేగం, దిశ, దూరాన్ని సరిగ్గా అంచనా వేసిన పంత్.. పర్ఫెక్ట్ జంప్​తో దాన్ని అందుకున్నాడు. ఈ క్యాచ్​ను బట్టి అతడి ఫిట్​నెస్​ లెవల్స్, క్యాచింగ్ ఎంత మెరుగయ్యాయో అర్థం చేసుకోవచ్చు. కీపింగ్​లో అదరగొట్టిన పంత్.. బ్యాటింగ్​లోనూ సత్తా చాటాడు. మొదటి ఇన్నింగ్స్​లో 7 పరుగులకే ఔట్ అయినా.. రెండో ఇన్నింగ్స్​లో 47 బంతుల్లో 61 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ ఏంటో ప్రూవ్ చేశాడు. 9 బౌండరీలు, 2 భారీ సిక్సులతో అపోజిషన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి కీపింగ్, బ్యాటింగ్ ఇండియా బీ విజయానికి దోహదపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 321 రన్స్ చేసిన ఇండియా బీ టీమ్, రెండో ఇన్నింగ్స్​లో 184 పరుగులు చేసింది. అటు మొదటి ఇన్నింగ్స్​లో 231 రన్స్ చేసిన ఇండియా ఏ జట్టు.. సెకండ్ ఇన్నింగ్స్​లో 198 రన్స్ చేసింది. 275 పరుగులు ఛేజ్ చేయాల్సిన టీమ్ కాస్తా.. విజయానికి 76 పరుగుల దూరంలో ఆగిపోయింది. మరి.. పంత్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.