iDreamPost
android-app
ios-app

రిషబ్ పంత్ సోదరి సాక్షి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Rishabh Pant Sister Engagement: రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Rishabh Pant Sister Engagement: రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

రిషబ్ పంత్ సోదరి సాక్షి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫొటోలు

రిషబ్ పంత్.. ఈ యంగ్ క్రికెటర్ టాలెంట్ గురించి క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తానేంటో రుజువు చేసుకున్నాడు. అందుకే ఏడాదికాలంగా టీమ్ ఇండియానే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా పంత్ ని ఎంతో మిస్ అవుతున్నారు. అయితే ఘోర ప్రమాదం నుంచి బయటపడిన పంత్ దాదాపుగా కోలుకున్నట్లనే వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం గేమ్ మీద ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అయితే పంత్ కి కాదులెండి. అతన సోదరికి తాజాగా నిశ్చితార్థం జరిగింది. ఆ విషయాన్ని పంత్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు.

టీమ్ ఇండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంట త్వరలోనే పెళ్లి వాయిద్యాలు మోగబోతున్నాయి. అతని సోదరి సాక్షి పంత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. తాజాగా అంకిత్ అనే యువకుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ ఎంగేజ్మెంట్ ను నిర్వహించారు. ఈ శుభకార్యంలో రిషబ్ పంత్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తన చిట్టి చెల్లి వివాహానికి పంత్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎంగేజ్మెంట్ విషయాన్ని పంత్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. తన సోదరికి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. తన ఫ్యామిలీతో పంత్ ఎంతో ఆనందంగా గడిపాడు.

engagement of rishab panth sister

మరోవైపు రిషబ్ పంత్ తన కెరీర్ గురించి కూడా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కారు అద్దాలు పగలగొట్టుకుని మంటలు వ్యాపించిన కారు నుంచి పంత్ బయటపడ్డాడు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కాపాడి పంత్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్యం కుదుటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2024లో సీజన్ లో పంత్ పాల్గొనడం దాదాపుగా ఖరారు అయ్యింది. కెప్టెన్ స్థానంలో మినీ వేలంలో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కూర్చుని ఉండటం చూశాం.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

మరోవైపు టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ వరల్డ్ కప్ కి కూడా పంత్ అందుబాటులో ఉంటాడనే చెబుతున్నారు. ఇప్పటి వరకు టీమిండియాలో పంత్ లేని లోటును ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలక్షన్ కమిటీకి కూడా తెలిసొచ్చింది. అంతేకాకుండా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా తిరిగి టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడని టాక్ వస్తోంది. రోహిత్, కోహ్లీ, పంత్ ఇలా అందరూ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తే.. 2024 పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ ను భారత్ కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్ కూడా ఈసారి కప్ మనదే అంటూ ఇప్పటి నుంచి ధీమాగా ఉంటున్నారు. మరి.. పంత్ సోదరికి మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Pant (@sakshi.pant)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి