iDreamPost
android-app
ios-app

అతను చెప్పేది అర్థం కాదు! రోహిత్‌ శర్మపై పంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Published Sep 10, 2024 | 4:42 PM Updated Updated Sep 10, 2024 | 4:42 PM

Rishabh Pant, Rohit Sharma: టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి స్టార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rishabh Pant, Rohit Sharma: టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి స్టార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Sep 10, 2024 | 4:42 PMUpdated Sep 10, 2024 | 4:42 PM
అతను చెప్పేది అర్థం కాదు! రోహిత్‌ శర్మపై పంత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

మరికొన్ని రోజుల్లో టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది రోహిత్‌ సేన. చాలా గ్యాప్‌ తర్వాత భారత జట్టు.. గ్రౌండ్‌లోకి దిగుతోంది. టీ20 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. దాదాపు 40 రోజుల తర్వాత అంతర్జాతీయ సిరీస్‌కు రెడీ అయింది. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌ కోసం స్క్వౌడ్‌ను కూడా ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌ శర్మ మాట్లాడేది తనకు అస్సలు అర్థం కాదని కుండబద్దలు కొట్టేశాడు. ముంబైకి చెందిన రోహిత్‌ శర్మ.. ఏది చెప్పాలనుకున్న స్పష్టంగా చెప్పలేడు. అది ఇది అక్కడ ఇక్కడా అంటూ.. మాటను సగం మింగేస్తూ ఉంటాడు. అతను ఏం చెబుతున్నాడో కూడా ఎవరికీ అర్థం కాదు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో.. గ్రౌండ్‌లో మట్టి ఎందుకు తిన్నావ్‌ అని ప్రధాని మోదీ అడిగ్గా.. అది అక్కడ అలా జరిగిపోయింది అంటూ.. చెప్పేశాడు. అది అంటే ఏంటి, అలా జరిగిపోయింది అంటే ఏం జరిగిపోయిందో ఎదుటివాళ్లే అర్థం చేసుకోవాలి.

ఒకసారి టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం.. రోహిత్‌ వే ఆఫ్‌ టాకింగ్‌ గురించి స్పందిస్తూ.. రోహిత్‌ చెప్పేస్తాడు కానీ, మనమే అర్థం చేసుకోవాలి అది ఏంటో అని సరదాగా పేర్కొన్నాడు. ఇప్పుడు పంత్‌ కూడా అదే విషయాన్ని వెల్లడించాడు. రోహిత్‌ శర్మ ఏం చెబుతున్నాడో.. తన గ్రౌండ్‌లో అర్థం అవుతుంది కానీ, ఆఫ్‌ ది ఫీల్డ్‌ అతను ఏం చెబుతున్నాడో తనకు అర్థం కాదని చెప్పాడు. మ్యాచ్‌ జరిగే సమయంలో రోహిత్‌ శర్మ చెప్పే మాటలు, ప్లానింగ్‌, స్ట్రాటజీ అర్థం అవుతాయి.. కానీ, ఆఫ్‌ ది ఫీల్డ్‌ జనరల్‌గా మాట్లాడే మాటలు తనకు అర్థం కావు, అతను ఏం చెబుతాడో ఏమో అంటూ తెలిపాడు. ‘అరె మనం అప్పుడు అక్కడికి వెళ్లాం.. అది జరిగింది కాదా.. అదే..’ ఇలా ఉంటుంది రోహిత్‌ మాట్లాడితే. అప్పుడు అంటే ఎప్పుడు, అక్కడికి అంటే ఎక్కడికి, అది జరిగింది కదా అంటే ఏం జరిగింది.. అదే అంటే ఏంటది ఇలా అన్ని విన్నవాళ్లే తెలుసుకోవాలి. మరి రోహిత్‌ మాట్లాడే మాటలు తనకు అర్థం కావు అంటూ పంత్‌ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.