SNP
Rishabh Pant, Barry McCarthy, India vs Ireland, T20 World Cup 2024: వరల్డ్ కప్ వేటను అద్భుతంగా మొదలుపెట్టింది టీమిండియా. పసికూన ఐర్లాండ్‌పై ఈజీ విజయంతో తొలి గెలుపును ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పంత్ చేసిన ఒక వండర్ గురించి తెలుసుకోవాలి. అదేంటో చూడండి..
Rishabh Pant, Barry McCarthy, India vs Ireland, T20 World Cup 2024: వరల్డ్ కప్ వేటను అద్భుతంగా మొదలుపెట్టింది టీమిండియా. పసికూన ఐర్లాండ్‌పై ఈజీ విజయంతో తొలి గెలుపును ఖాతాలో వేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో పంత్ చేసిన ఒక వండర్ గురించి తెలుసుకోవాలి. అదేంటో చూడండి..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా విజయంతో మొదలుపెట్టింది. పసికూన ఐర్లాండ్‌పై ఈజీ విక్టరీతో వరల్డ్ కప్ వేట ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కొన్ని ప్రయోగాలతో బరిలోకి దిగింది. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తన పార్ట్నర్‌గా విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఓపెనర్‌గా కోహ్లీ ఫామ్ చూసి.. అతన్ని ఓపెనర్‌గా ఆడించాడు. అయితే తొలి మ్యాచ్‌లో కోహ్లీ విఫలమైనా.. ఈ ఐడియా మాత్రం సూపర్ అంటూ క్రికెట్ పండితులు కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే రిషభ్ పంత్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దింపి రోహిత్ మంచి పని చేశాడు. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకుంటూ.. పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలుస్తూ.. టీమిండియా వరల్డ్ కప్‌లో తొలి విజయం అందించాడు.
కేవలం విజయం మాత్రమే కాదు.. చాలా కాలం తర్వాత టీమిండియా జెర్సీలో బరిలోకి దిగిన పంత్ తనదైన స్టైల్లో అలరించాడు. పంత్ దెబ్బకు ఐర్లాండ్ స్టార్ బౌలర్ సైతం నోరెళ్లబెట్టాడు. ఐర్లాండ్ పేసర్ బారీ మెక్‌కార్తీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ రెండో బంతికి పంత్ కొట్టిన సిక్స్.. మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. అంతకంటే ముందు బాల్‌కు ఇబ్బంది పడిన పంత్.. తర్వాతి బాల్‌కు తన పవరేంటో బౌలర్‌కు రుచిచూపించాడు. లెంత్ బాల్‌ను రివర్స్ స్వీప్‌తో భారీ సిక్స్ కొట్టాడు. ఏదో స్పిన్నర్‌ను ఆడుతున్నట్లు.. చాలా ఈజీగా రివర్స్ స్వీప్ ఆడటంతో బౌలర్ బారీ మెక్‌కార్తీ షాక్ అయ్యాడు.
పంత్ కొట్టిన సిక్స్‌కు అతనిచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. ఎంతైనా పంత్ ఇలాంటి షాట్లు ఆడితే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. చాలా కాలంగా ఇలాంటి ఆటను భారత క్రికెట్ అభిమానులు మిస్ అవుతున్నారు. పంత్ వచ్చిరావడంతోనే అలాంటి విచిత్రమైన షాట్ల విందును ఇస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐర్లాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కెప్టెన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. ఐర్లాండ్‌ను 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌట్ చేశారు. గారెత్ డెలానీ ఒక్కడే 14 బంతుల్లో 26 పరుగులు చేసి టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో ఐర్లాండ్ కుప్పకూలింది.
భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్, బుమ్రా 2, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 97 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీని మార్క్ అడైర్ అవుట్ చేశాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి కోహ్లీ పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 52, పంత్ 36 పరుగులు చేసి టీమిండియా విజయాన్ని ఖాయం చేశారు. సూర్య 2 పరుగులు చేసి నిరాశపర్చాడు. చివర్లో పంత్, శివమ్ దూబే నాటౌట్‌గా మిగిలారు. సిక్స్‌తో మ్యాచ్ ముగించి పంత్ తనదైన స్టైల్లో విజయం అందించాడు. మరి ఈ మ్యాచ్‌లో పంత్ కొట్టిన సిక్స్‌తో పాటు బౌలర్ ఇచ్చిన రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rishabh Pant hitting the winning six #Rishabhpant #rohitsharma #cricket
DM for Credit pic.twitter.com/ajlQvSDlS3
— Riseup Pant (@riseup_pant17) June 5, 2024
Look at Barry McCarthy’s reactions when Rishabh Pant hits reverse sweep for a SIX against him. pic.twitter.com/LNhU5x6io1
— Tanuj Singh (@ImTanujSingh) June 5, 2024