iDreamPost
android-app
ios-app

Rishabh Pant: పంత్​ను BCCI అవమానిస్తోంది.. అతడ్ని హీనంగా చూస్తోంది: మాజీ క్రికెటర్

  • Published Aug 15, 2024 | 4:48 PM Updated Updated Aug 15, 2024 | 4:48 PM

Rishabh Pant Captaincy Controversy: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లాంగ్ ఫార్మాట్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Rishabh Pant Captaincy Controversy: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లాంగ్ ఫార్మాట్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

  • Published Aug 15, 2024 | 4:48 PMUpdated Aug 15, 2024 | 4:48 PM
Rishabh Pant: పంత్​ను BCCI అవమానిస్తోంది.. అతడ్ని హీనంగా చూస్తోంది: మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ రిషబ్ పంత్ ఇప్పుడు మరో టోర్నమెంట్​లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వైట్ బాల్ క్రికెట్​లో రచ్చ చేస్తూ వచ్చిన అతడు.. ఇప్పుడు రెడ్ బాల్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు పంత్. అయితే ఈ టోర్నమెంట్​లో అతడ్ని ప్లేయర్​గా మాత్రమే తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు తరఫున 33 టెస్టులు ఆడిన పంత్​ను కాదని.. డొమెస్టిక్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్​కు దులీప్ ట్రోఫీ టీమ్​లో కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. దీంతో భారత క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పంత్​ వివాదంపై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. దులీప్ ట్రోఫీలో అతడ్ని కేవలం ప్లేయర్​గా ఆడించడం, సారథ్య బాధ్యతలు అప్పగించకపోవడం సరికాదన్నాడు. ఇది పంత్​ను అవమానించడమేనని.. అతడ్ని బచ్చా ప్లేయర్​గా చూస్తున్నారని సీరియస్ అయ్యాడు. ‘రిషబ్ పంత్​ను కెప్టెన్​గా నియమించలేదు. అతడు ఎంపికైన టీమ్​-బీకి అభిమన్యు ఈశ్వరన్​ను సారథి చేశారు. పంత్ టెస్ట్ కెప్టెన్సీకి పనికిరాడా? నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పంత తన బెస్ట్ ఇచ్చింది టెస్టుల్లోనే. లాంగ్ ఫార్మాట్​లో బాగా ఆడి అతడు క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటోడ్ని అదే ఫార్మాట్ మ్యాచులకు కెప్టెన్ చేయకపోవడం షాకింగ్​గా ఉంది’ అని ఆకాశ్ చోప్రా విస్మయం వ్యక్తం చేశాడు.

Pant is insulted by BCCi

ఇక, కొత్త కోచ్ గౌతం గంభీర్ రాకతో భారత క్రికెట్​లో పలు మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. టీ20లు, వన్డేలకు శుబ్​మన్ గిల్​ను వైస్ కెప్టెన్​గా నియమించారు. సూర్యకుమార్ యాదవ్​కు టీ20 సారథ్య పగ్గాలు అప్పగించారు. వన్డేలు, టెస్టుల్లో రోహిత్ శర్మను కెప్టెన్​గా కంటిన్యూ చేస్తున్నారు. దీంతో టెస్టులకు ఎవర్ని వైస్ కెప్టెన్ చేస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. జస్​ప్రీత్ బుమ్రా, పంత్​లో ఒకరికి ఈ రోల్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ దులీప్ ట్రోఫీ టీమ్స్​లో ఒక టీమ్​కు గిల్, మరో రెండు టీమ్స్​కు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్​ను కెప్టెన్స్​గా నియమించారు. కానీ పంత్ ఉన్న జట్టుకు అతడ్ని కాదని అభిమన్యుకు సారథ్యం ఇచ్చారు. దీంతో ఇన్​డైరెక్ట్​గా టెస్టుల్లో పంత్​కు వైస్ కెప్టెన్సీ దక్కదనే ఇండికేషన్స్ ఇచ్చారని అంటున్నారు. దీని పైనే ఆకాశ్ చోప్రా పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. మరి.. దులీప్ ట్రోఫీలో పంత్​ను కేవలం ఆటగాడిగానే సెలెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.