iDreamPost
android-app
ios-app

కమ్​బ్యాక్ లోడింగ్.. తీవ్రంగా శ్రమిస్తున్న పంత్! టార్గెట్ అదేనా..?

  • Author singhj Published - 05:12 PM, Mon - 4 September 23
  • Author singhj Published - 05:12 PM, Mon - 4 September 23
కమ్​బ్యాక్ లోడింగ్.. తీవ్రంగా శ్రమిస్తున్న పంత్! టార్గెట్ అదేనా..?

రిషబ్ పంత్.. భారత క్రికెటర్లలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వారిలో ఒకడని చెప్పొచ్చు. టీమిండియాకు లభించిన అరుదైన టాలెంటెడ్ ప్లేయర్లలో పంత్ ఒకడని విశ్లేషకులు అంటుంటారు. కీపర్​గా కంటే బ్యాటర్​గా రిషబ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా తరఫున అతడు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడాడు. కెరీర్​ మంచి స్వింగ్​లో ఉన్న టైమ్​లో పంత్​కు యాక్సిడెంట్ అయింది. గతేడాది డిసెంబర్ 30వ తేదీన తన కారులో ఉత్తరాఖండ్​లోని రూర్కీకి వెళ్తుండగా డివైడర్​ను ఢీకొన్నాడు. అయితే ఆ టైమ్​లో అదృష్టవశాత్తూ గాయాలతో పంత్ బయటపడ్డాడు.

కారు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలి లిగ్​మెంట్లు దెబ్బతినడంతో డాక్టర్లు అతడికి సర్జరీ చేశారు. గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 మొత్తం సీజన్​కు ఈ స్టార్ లెఫ్టాండ్ బ్యాటర్ దూరమయ్యాడు. అలాగే ప్రతిష్టాత్మక ఆసియా కప్​కు కూడా అతడు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే సర్జరీ అనంతరం కోలుకున్న పంత్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరిపోయాడు. టీమిండియాలోకి కమ్​బ్యాక్ ఇచ్చేందుకు కఠోరంగా శ్రమిస్తున్నాడీ యంగ్ క్రికెటర్. తాజాగా తన ట్రైనింగ్​కు సంబంధించిన ఒక వీడియోను పంత్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో పంచుకున్నాడు.

తాజా వీడియోలో జోరుగా వర్కౌట్స్ చేస్తూ దర్శనమిచ్చాడు రిషబ్ పంత్. ఈ వీడియో చూస్తే అతడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్​లో ఆడటమే టార్గెట్​గా పంత్ కఠోర సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మునుపటిలా ఫుల్ ఫిట్​గా మారేందుకు అతడికి మరికొంత టైమ్ పట్టేటట్లు కనిపిస్తోంది. ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు.. ‘చీకటి కుహరంలో కొంత వెలుగైనా చూడటం మొదలైనందుకు దేవుడికి ధన్యవాదాలు’ అని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. రిషబ్ ఫిట్​నెస్, వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడు త్వరగా భారత జట్టులోకి కమ్​బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఇదేం ఫీల్డింగ్: 4 ఓవర్లలో 3 క్యాచ్​లు మిస్!