iDreamPost

పసికూనపై చెత్త ఫీల్డింగ్! 4 ఓవర్లలో 3 క్యాచ్ లు మిస్!

  • Author Soma Sekhar Published - 04:00 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Published - 04:00 PM, Mon - 4 September 23
పసికూనపై చెత్త ఫీల్డింగ్! 4 ఓవర్లలో 3 క్యాచ్ లు మిస్!

ఆసియా కప్ 2023లో భాగంగా కీలకమైన మ్యాచ్ లో నేపాల్ తో తలపడుతోంది టీమిండియా. ఈ టోర్నీలో పాక్ తో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. టీమిండియా ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి సంక్లిష్ట సమయంలో పసికూనపై చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా మ్యాచ్ ను ప్రారంభించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు ఘోరమైన ఫీల్డింగ్ తో 4 ఓవర్లలో 3 క్యాచ్ లను మిస్ చేసింది. దీంతో లైఫ్ లభించిన నేపాల్ ఆటగాళ్లు ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు.

నేపాల్ తో పల్లెకెలే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించింది నేపాల్ జట్టు. టీమిండియా పేస్ దళం దాటికి నేపాల్ ఓపెనర్లు ఆసిఫ్ షేక్, ఖుషాల్ బుర్టెల్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుమ్రా గైర్హాజరీ తో జట్టులోకి వచ్చిన షమీ తొలి ఓవర్ అద్భుతంగా వేశాడు. ఈ ఓవర్ చివరి బంతికి నేపాల్ ఓపెనర్ బుర్టెల్ షాట్ ఆడగా.. బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో ఉన్న శ్రేయస్ అయ్యార్ చేతిలో పడింది. కానీ ఈ క్యాచ్ ను అతడు అందుకోలేకపోయాడు. ఇది పక్కన పెడితే.. ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన క్యాచ్ ను టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ మిస్ చేశాడు. స్ట్రైట్ కవర్స్ దిశగా ఆసిఫ్ బంతిని కొట్టగా.. దాన్ని అందుకోవడంలో కోహ్లీ విఫలం అయ్యాడు.

దీంతో లైఫ్ లభించిన ఇద్దరు స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తున్నారు. షమీ వేసిన నాలుగో ఓవర్లో మరోసారి టీమిండియా చెత్త ఫీల్డింగ్ బయటపడింది. ఈసారి క్యాచ్ మిస్ చేయడం కీపర్ ఇషాన్ కిషన్ వంతు అయ్యింది. షమీ వేసిన ఈ ఓవర్ లో బుర్టెల్ గ్లోవ్స్ తాకిన బంతి అందుకోవడంలో ఇషాన్ విఫలం అయ్యాడు. కేవలం 4 ఓవర్ల గ్యాప్ లో 3 క్యాచ్ లు మిస్ చేయడం.. అదీ కూడా వరల్డ్ క్లాస్ ఫీల్డర్లు ఉన్న టీమిండియా ఆటగాళ్లు కావడం దారుణం అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. నేపాల్ ఓపెనర్లకు మూడు జీవనాధారాలు లభించడంతో.. వారు మరింతగా రెచ్చిపోయి ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది నేపాల్ జట్టు. శార్ధూల్ ఠాకూర్ తొలి వికెట్ తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి