RINKU SINGH: దంచికొట్టిన రింకూ సింగ్.. బ్రో నిజంగా నువ్వు ఫినిషర్ వే!

  • Author Soma Sekhar Updated - 07:24 AM, Wed - 13 December 23

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన రీతిలో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ దుమ్మురేపాడు. తనకే సాధ్యమైన రీతిలో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

  • Author Soma Sekhar Updated - 07:24 AM, Wed - 13 December 23

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ చెలరేగాడు. కొంత కాలంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న అతడు.. అదే జోరును సఫారీ టీమ్ పై కూడా చూపించాడు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, శుబ్ మన్ గిల్ ఇద్దరూ డకౌట్ అయిన వేళ కెప్టెన్ సూర్యకుమార్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు రింకూ సింగ్. సూర్య సైతం అద్భుతమైన ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం రింకూ సఫారీ బౌలర్లను దంచికొడుతూ.. కేవలం 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రింకూ తుఫాన్ బ్యాటింగ్ కారణంగా టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది.

రింకూ సింగ్.. టీమిండియా నయా ఫినిషర్. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యువ కెరటం, అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో ఫినిషర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే జోరును సౌతాఫ్రికాపై చూపెట్టాడు. సఫారీ టీమ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో చెలరేగిపోయాడు రింకూ. ఓపెనర్లు దారుణంగా విఫలమైన వేళ.. కెప్టెన్ సూర్యతో కలిసి విలువైన 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య(56) అవుటైన తర్వాత రవీంద్ర జడేజా(19)తో కలిసి భారీ స్కోర్ కు బాటలు వేశాడు.

ఈ క్రమంలోనే 30 బంతుల్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. సఫారీ పిచ్ లపై యువ ఆటగాళ్లు ఎలా ఆడతారో అన్న భయాన్ని పొగొడుతూ.. దుమ్మురేపాడు రింకూ. కాగా.. ఇన్నింగ్స్ 19.3వ ఓవర్లో వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. వర్షం ఆగిన తర్వాత సౌతాఫ్రికాకు ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి 152 పరుగుల టార్గెట్‌ ఇచ్చారు. ఈ టార్గెట్‌ను ప్రొటీస్‌ జట్టు 13.5 ఓవర్లలోనే ఛేదించి.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్ లతో 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలనప్పటికీ..  రింకూ సింగ్ ఆయన తుపాన్‌ ఇన్నింగ్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments