రింకూ సింగ్.. ఈ టీమిండియా సెన్సేషన్ గురించి అందరికీ తెలిసిందే. క్రీజులో అడుగుపెడితే ఫోర్లు, భారీ సిక్సులతో విరుచుకపడటం రింకూకు వెన్నతో పెట్టిన విద్య. బౌలర్ ఎవరు, మ్యాచ్ కండీషన్ ఏంటనేది ఈ ధనాధన్ బ్యాటర్ అంతగా పట్టించుకోడు. బాల్ కనిపిస్తే చాలు బాదుడే అన్నట్లుగా అతడి బ్యాటింగ్ సాగుతుంది. ఇలాంటి బ్యాటింగ్ శైలితోనే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రింకూ ఎన్నో విజయాలు అందించాడు. ఈ ఏడాది మెగా లీగ్‌లో ఒక మ్యాచ్‌లోనైతే వరుసగా ఐదు సిక్సులు కొట్టి క్రికెట్ వరల్డ్‌ను షేక్ చేశాడు రింకూ సింగ్.
యష్ దయాళ్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని రింకూ సింగ్ అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో అతడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఐపీఎల్ తర్వాత కూడా అదే తరహాలో పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు రింకూ. నిలకడగా ఆడుతూ టీమిండియాలో ప్లేస్ దక్కించుకున్నాడు. రీసెంట్గా టీ20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడీ లెఫ్టాండ్ బ్యాటర్. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాడు రింకూ. ఆ మ్యాచ్‌లో 15 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాలో లెఫ్టాండర్ల కొరత ఉంది. అందుబాటులో కొందరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నా.. వాళ్లు కన్సిస్టెంట్గా ఆడటం లేదు.
రింకూ సింగ్ ఇదే తరహాలో మెరుపు బ్యాటింగ్‌ను కొనసాగిస్తే ఫ్యూచర్లో భారత టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఒక ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం ఇచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రింకూ ఆ రాష్ట్రంలోని కమలాపూర్‌లో కడుతున్న ఒక గుడి కోసం ఏకంగా రూ.11 లక్షలు డొనేట్ చేశాడు. దీంతో రింకూపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇది రింకూ మంచితనమని కొందరు అంటుంటే.. ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు దైవభక్తి ఎక్కువేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆలయం కోసం రింకూ భారీ విరాళం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మ్యాంగో మ్యాన్ నవీన్ కోసం కోహ్లీ చేసిన పని వైరల్!
Rinku Singh donated 11 Lakhs for the construction of a temple in Kamalpur, Uttar Pradesh. (AmarUjala).
– A lovely gesture by Rinku….!!! pic.twitter.com/WxuQX1tXHW
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2023