iDreamPost
android-app
ios-app

ఆ కుర్రాడ్ని టీమ్​లోకి తీసుకో.. రోహిత్​కు మాజీ బ్యాటింగ్ కోచ్ రాథోడ్ సజెషన్!

  • Published Jul 15, 2024 | 9:36 PM Updated Updated Jul 15, 2024 | 9:36 PM

Team India: టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీని గెలుచుకొని ఛాంపియన్స్​గా నిలిచింది భారత జట్టు. షార్ట్ గ్యాప్​లో జింబాబ్వేతో జరిగిన సిరీస్​నూ పట్టేసింది. కుర్రాళ్లతో నిండిన టీమ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది.

Team India: టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీని గెలుచుకొని ఛాంపియన్స్​గా నిలిచింది భారత జట్టు. షార్ట్ గ్యాప్​లో జింబాబ్వేతో జరిగిన సిరీస్​నూ పట్టేసింది. కుర్రాళ్లతో నిండిన టీమ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది.

  • Published Jul 15, 2024 | 9:36 PMUpdated Jul 15, 2024 | 9:36 PM
ఆ కుర్రాడ్ని టీమ్​లోకి తీసుకో.. రోహిత్​కు మాజీ బ్యాటింగ్ కోచ్ రాథోడ్ సజెషన్!

టీ20 వరల్డ్ కప్​ ట్రోఫీని గెలుచుకొని ఛాంపియన్స్​గా నిలిచింది భారత జట్టు. షార్ట్ గ్యాప్​లో జింబాబ్వేతో జరిగిన సిరీస్​నూ పట్టేసింది. కుర్రాళ్లతో నిండిన టీమ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. తదుపరి శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​పై ఫోకస్ పెడుతోంది. అయితే ఆల్రెడీ పొట్టి కప్పు గెలిచిన భారత్ ముందు భవిష్యత్తులో భారీ లక్ష్యాలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్​లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టెస్టుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ను గెలుచుకోవాల్సి ఉంది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్​లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓడింది రోహిత్ సేన. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​లో రెండుసార్లు ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహితే టీమ్​కు కెప్టెన్​గా కంటిన్యూ కానున్నాడు. కాబట్టి అతడు రెండు లక్ష్యాలను అందుకోవాలి.

ముఖ్యంగా టెస్టుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వెళ్తున్నా ట్రోఫీని కైవసం చేసుకోలేకపోతోంది టీమిండియా. మొదటిసారి న్యూజిలాండ్, రెండోసారి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగొచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ ఫైనల్స్​కు ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ ఇప్పటినుంచే టీమ్​ కాంబినేషన్​ను సెట్ చేసుకోవాలి. ఏయే ప్లేయర్లు ఎక్కడెక్కడ ఆడాలి? అనే దానిపై క్లారిటీకి రావాలి. అలాగే టీ20లు, వన్డేల్లో రాణిస్తున్న యంగ్​స్టర్స్​లో నుంచి లాంగ్ ఫార్మాట్​కు సూట్ అవుతారనుకునే వారిని టీమ్​లోకి తీసుకోవాలి. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రింకూ సింగ్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్​ను టెస్టుల్లో ఆడించాలని ఆయన సూచించాడు.

రింకూను టెస్టుల్లో ఆడిస్తే టీమిండియాకు తిరుగుండదన్నాడు విక్రమ్ రాథోడ్. అతడ్ని లాంగ్ ఫార్మాట్​లోకి తీసుకోవాలంటూ రోహిత్​కు సజెషన్ చేశాడు. ‘రింకూ సింగ్​లో అపార ప్రతిభ దాగి ఉంది. అతడు నెట్స్​లో బ్యాటింగ్ చేసే టైమ్​లో చూస్తే టెక్నికల్​గా ఏమాత్రం తప్పులు కనిపించలేదు. ఇంత సాలిడ్ బ్యాటర్​ను టెస్టుల్లోకి తీసుకుంటే తప్పేంటి? అతడి ఫస్ట్ క్లాస్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. అతడి బ్యాటింగ్ సగటు 50కి పైనే ఉంది. ఇంత కూల్​, కామ్​ టెంప్రమెంట్ ఉన్న ప్లేయర్​ను టెస్టు బ్యాటర్​గా డెవలప్ చేయాల్సిందే’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. ఇక, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్​ తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో టీమ్ మేనేజ్​మెంట్​లో భాగంగా ఉన్న బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్​ను కూడా బీసీసీఐ తొలగించింది. మరి.. రాథోడ్ చెప్పినట్లు రింకూ టెస్టులకు పనికొస్తాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.