Nidhan
Shakib Al Hasan, IND vs BAN: తొలి టెస్ట్‌లో భారత్ చేతుల్లో చావుదెబ్బ తిన్న బంగ్లాదేశ్.. రెండో టెస్ట్ కోసం రెడీ అవుతోంది. చెన్నైలో చిత్తవడంతో ప్రతీకారంతో రగిలిపోతున్న షంటో సేన.. కాన్పూర్‌లో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. కానీ కనీసం పోటీ ఇచ్చినా గొప్పే అనిపిస్తోంది.
Shakib Al Hasan, IND vs BAN: తొలి టెస్ట్‌లో భారత్ చేతుల్లో చావుదెబ్బ తిన్న బంగ్లాదేశ్.. రెండో టెస్ట్ కోసం రెడీ అవుతోంది. చెన్నైలో చిత్తవడంతో ప్రతీకారంతో రగిలిపోతున్న షంటో సేన.. కాన్పూర్‌లో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. కానీ కనీసం పోటీ ఇచ్చినా గొప్పే అనిపిస్తోంది.
Nidhan
తొలి టెస్ట్‌లో భారత్ చేతుల్లో చావుదెబ్బ తిన్న బంగ్లాదేశ్.. రెండో టెస్ట్ కోసం రెడీ అవుతోంది. చెన్నైలో చిత్తవడంతో ప్రతీకారంతో రగిలిపోతున్న షంటో సేన.. కాన్పూర్‌లో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. కానీ కనీసం పోటీ ఇచ్చినా గొప్పే అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి టెస్ట్‌లో ఆ టీమ్ అంత చెత్తగా ఆడింది. ఏకంగా 280 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన చేతుల్లో మట్టికరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఎందులోనూ మన జట్టుకు సమవుజ్జీగా కనిపించలేదు. పసికూన కంటే దారుణంగా ఆడుతూ తీవ్రంగా నిరాశపర్చింది. అయితే రెండో టెస్ట్‌లో విజయం సాధించి పోయిన పరువును దక్కించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఆ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి రెండో టెస్ట్ మొదలవనుంది. ఇప్పటికే రెండు జట్లు అక్కడికి చేరుకున్నాయి. రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేయనున్నాయి. భారత్‌ను ఎలాగైనా ఓడించాలని.. కనీసం గట్టి పోటీ అయినా ఇద్దామని బంగ్లా క్యాంప్ భావిస్తోంది. కానీ ఆ జట్టుకు ఇది కష్టంగానే ఉంది. ఆల్రెడీ ఘోర ఓటమితో అవమానం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు ఇప్పుడు మరో ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంజ్యురీ కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడని వినిపిస్తోంది. చెపాక్ టెస్ట్‌లో అతడి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షకీబ్ రైట్ హ్యాండ్ ఫింగర్‌కు బాల్ బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు తల్లడిల్లాడు.
వేలి గాయంతో ఇబ్బంది పడుతున్న షకీబ్‌కు వెంటనే ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ అందించాడు. అనంతరం షకీబ్ తన ఇన్నింగ్స్‌ను కంటిన్యూ చేశాడు. కానీ గ్రౌండ్లో ఉన్నంత సేపు అతడు అన్‌కంఫర్టబుల్‌గా కనిపించాడు. నొప్పిని భరిస్తూనే మొత్తం మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడ్ని స్కానింగ్‌కు తరలించగా.. ఎలాంటి పగులు లేదని తేలిందని సమాచారం. అయితే వారం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట. ఒకవేళ షకీబ్ రెండో టెస్ట్‌లో ఆడకపోతే బంగ్లాకు తీవ్ర నష్టమనే చెప్పాలి. అతడు మొదటి టెస్ట్‌లో అంతగా ప్రభావం చూపించలేదు.
చెన్నై టెస్ట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఫెయిల్ అయ్యాడు షకీబ్. కానీ కాన్పూర్ వికెట్ స్పిన్‌కు అనుకూలం అంటున్నారు. దీంతో ఈ పిచ్‌పై స్పిన్నర్ అయిన షకీబ్ సత్తా చాటే ఛాన్స్ ఉందని బంగ్లా భావించింది. ఈ తరుణంలో గాయం వల్ల అతడు దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ టీమ్ మేనేజ్మెంట్ కలవరపడుతోందని తెలిసింది. షకీబ్ ఆడకపోతే అతడి ప్లేస్‌లో ఎవర్ని తీసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. షకీబ్ దూరమనే వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కనీసం పోరాడుతుంది అనుకంటే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిందని అంటున్నారు. ఇంక భారత్ ముందు బంగ్లా సాగిలపడటం ఖాయమని చెబుతున్నారు. మరి.. షకీబ్ లోటును బంగ్లా ఎలా భర్తీ చేస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.