వరల్డ్ కప్ ఫైనల్.. ఆందోళనలో టీమిండియా ఫ్యాన్స్! ఫైనల్ కు ఐరన్ లెగ్ అంపైర్

  • Author Soma Sekhar Published - 09:30 AM, Sat - 18 November 23

ఓ బ్యాడ్ సెంటిమెంట్ టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఓ అంపైర్ భారత అభిమానులను తన రికార్డులతో బెంబేలెత్తిస్తున్నాడు. మరి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఐరన్ లెగ్ గా భావించే ఆ అంపైర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ బ్యాడ్ సెంటిమెంట్ టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఓ అంపైర్ భారత అభిమానులను తన రికార్డులతో బెంబేలెత్తిస్తున్నాడు. మరి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఐరన్ లెగ్ గా భావించే ఆ అంపైర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 09:30 AM, Sat - 18 November 23

ప్రపంచ కప్ 2023 తుది సమరానికి సర్వం సిద్దమైంది. ఈ పోరుకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ టైటిల్ పోరులో టీమిండియాను ఢీకొనబోతోంది పటిష్ట ఆస్ట్రేలియా జట్టు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియాకు వరల్డ్ కప్ గెలవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఓ బ్యాడ్ సెంటిమెంట్ టీమిండియా ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఓ అంపైర్ భారత అభిమానులను తన రికార్డులతో బెంబేలెత్తిస్తున్నాడు. అందుకే అతడిని టీమిండియా క్రికెట్ అభిమానులు శనిదేవుడిలా భావిస్తారు. మరి ఇలాంటి అంపైరే ఫైనల్ మ్యాచ్ కు వస్తున్నాడన్నదే అసలు సమస్య. ఇంతకీ ఆ ఫైనల్ కు వచ్చే ఐరన్ లెగ్ అంపైర్ ఎవరు? అతడు అంపైర్ గా చేసిన ఎన్ని మ్యాచ్ ల్లో టీమిండియా ఓడిపోయిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఢీకొనబోతున్నాయి. ఈ సమరం కోసమే ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం(నవంబర్ 19న) నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తుది సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ను ఓ విషయం తెగ ఆందోళనకు గురిచేస్తోంది. అదేంటంటే? భారత క్రికెట్ ఫ్యాన్స్ శనిదేవుడిలా భావిస్తారు ఓ అంపైర్ ను. అతడి పేరు రిచర్డ్ కెటిల్ బరో. ఇంగ్లాండ్ కు చెందిన ఈ అంపైర్ భారత్ కు శత్రువులా తయ్యారు అయ్యాడు. యాదృశ్చికమో.. లేదా కాకతాళియమో తెలీదు కానీ అతడు అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో టీమిండియా విజయం సాధించింది లేదు. ఈ విషయమే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. ఐరన్ లెగ్ అంపైర్ గా భారత అభిమానులు ముద్రవేసిన కెటిల్ బరో ఫైనల్ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తున్నాడు.

గతంలో రిచర్డ్ కెటిల్ బరో అంపైర్ గా వ్యవహరించిన 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో 95 రన్స్ తో పరాజయం పాలై నాకౌట్స్ లోనే ఇంటిదారి పట్టింది. అదీకాక 2016 టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో కూడా వెస్టిండీస్ పై టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది. దాయాది పాక్ చేతిలో ఓటమి చవిచూసింది భారత జట్టు. చివరికి 2019 వన్డే ప్రపంచ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఓడిపోయిన సంగతి విదితమే. ఈ బ్యాడ్ సెంటిమెంటే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. కాగా.. ఈ ఫైనల్ మ్యాచ్ కు మరో అంపైర్ గా ఇంగ్లాండ్ కే చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ వ్యవహరించనున్నాడు. మరి ఈ సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments