SNP
టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌పై భారత క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే అయ్యర్‌ను దూరంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అయ్యర్ ఏం చేశాడు? దానికి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌పై భారత క్రికెట్ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే అయ్యర్‌ను దూరంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అయ్యర్ ఏం చేశాడు? దానికి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతంగా ఆడాడు. అంతకు ముందే టీమ్‌లో కీ ప్లేయర్‌గా మారి నాలుగో స్థానాన్ని పర్మినెంట్ చేసుకున్న అయ్యర్ గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ ముందు రీ ఎంట్రీ ఇచ్చి.. మంచి ప్రదర్శనతో వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోవడమే కాక, బాగా రాణించి ప్రశంసలు పొందాడు. ఇక టీమిండియాకు ఫ్యూచర్ స్టార్‌గా పేరొందాడు. కానీ, అనూహ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు అయ్యర్‌ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. ఈ నిర్ణయంతో అంతా షాక్ అయ్యారు.
శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కాదు.. టీ20 టీమ్‌లో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ లేకపోవడం సైతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేఎల్ రాహుల్ సంగతి పక్కనపెడితే.. అయ్యర్, ఇషాన్‌పై మాత్రం బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వారిని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మానసిక అలసట అని చెప్పి.. దుబాయ్‌లో పార్టీతో పాటు, అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేసే కౌన్ బనేగా కరోడ్ పతి షోకు.. బీసీసీఐ పర్మిషన్ లేకుండా వెళ్లడంతో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై వేటులో భాగంగానే టీ20 టీమ్‌లోకి తీసుకోలేదని జాతీయ మీడియా పేర్కొంటోంది.
అలాగే శ్రేయస్ అయ్యర్‌పై కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే.. టీ20 జట్టులోకి తీసుకోకుండా దూరంగా పెట్టినట్లు తెలుస్తుంది. అయ్యర్ బ్యాటింగ్ స్టైల్‌కు టీ20 క్రికెట్ సరిగ్గా జరిగిపోతుంది. పైగా ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్, టీ20 సిరీస్‌లలో అయ్యర్ అద్బుతంగా రాణించాడు. పైగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అయ్యర్.. టీ20 టీమ్‌లో ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ, ఆట కంటే క్రమశిక్షణ ముఖ్యమని భావించిన బీసీసీఐ ఇషాన్ కిషన్‌తో పాటు అయ్యర్‌పై కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ విషయంపై స్పందించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అలాంటిదేం లేదని తోసిపుచ్చాడు. ఇషాన్ కిసన్ రెస్ట్ కోరాడని, టీమ్‌లో ఎక్కువ మంది బ్యాటర్లు ఉండటంతో అయ్యర్ చోటు దక్కలేదని, అంతకు మించి ఏం లేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. మరి అయ్యర్‌ను పక్కన పెట్టడం చర్యల్లో భాగమేనా? లేక ద్రవిడ్ చెప్పినట్లు అలాంటిదేం లేదా? మీరేం అనుకుంటున్నారో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer and Ishan Kishan not selected in India’s squad for the T20I series against Afghanistan on disciplinary grounds. (Anandabazar Patrika) pic.twitter.com/fM5Qm6wfoZ
— CricketMAN2 (@ImTanujSingh) January 10, 2024