Shikhar Dhawan Retirement: ధావన్‌ రిటైర్మెంట్‌‌కు కారణం.. ఇంకా ఆడే సత్తా ఉన్నా ఆ రీజన్స్ వల్లే!

Reasons For Shikhar Dhawan Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోను అతడు రిలీజ్ చేశాడు. తన కెరీర్ ఎలా సాగింది తదితర విషయాలు అందులో చెప్పుకొచ్చాడు.

Reasons For Shikhar Dhawan Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియోను అతడు రిలీజ్ చేశాడు. తన కెరీర్ ఎలా సాగింది తదితర విషయాలు అందులో చెప్పుకొచ్చాడు.

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు గబ్బర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు కూడా అతడు గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు ధావన్. ఆ వీడియోలో తన క్రికెట్ ప్రయాణం ఎలా సాగిందనేది చెప్పుకుంటూ వచ్చాడు. దేశం తరఫున ఇన్నాళ్లు ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు గబ్బర్. ఈ క్రికెటింగ్ జర్నీలో ఎంతో మంది సాయం చేశారని, వాళ్ల సహకారం వల్లే ఈ రేంజ్ కు చేరుకున్నానని చెప్పాడు. కెరీర్ ఆసాంతం అండగా ఉంటూ వచ్చిన బీసీసీఐ, డీడీసీఏకు అలాగే ఫ్యాన్స్ కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ధావన్ రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు ఏంటని అభిమానులు ఆరా తీసే పనిలో పడ్డారు.

దాదాపు దశాబ్ద కాలం పాటు అద్బుతమైన బ్యాటింగ్, సూపర్బ్ ఫీల్డింగ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో దుమ్మురేపిన ధావన్.. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం, యువకులు రివ్వున దూసుకురావడంతో పోటీ తట్టుకోలేకపోయాడు. టీమిండియాలోకి రీఎంట్రీ కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ తరుణంలోనే గాయాలవడం అతడి కెరీర్ కు శాపంగా మారింది. ఇంజ్యురీ వల్ల ఈ ఏడాది ఐపీఎల్ లో దాదాపుగా సగానికి పైగా మ్యాచులకు దూరమయ్యాడు గబ్బర్. అతడి వయసు 38. పూర్తిగా ఫామ్ కోల్పోలేదు. ఫిట్ గా మారి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇంకో రెండు, మూడేళ్లు ఈజీగా ఆడొచ్చు. 43 ఏళ్ల ధోని ఇంజ్యురీ అయినా ఐపీఎల్ లో నెట్టుకొస్తున్నాడు. ధావన్ తలచుకుంటే అలాగే కొనసాగొచ్చు. కానీ బాడీ సహకరించకపోవడం, భారత జట్టులోకి కమ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో రిటైర్ అవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ధావన్.. ఐపీఎల్ మీద ఎటూ తేల్చలేదు. అయితే ఫామ్ కోల్పోవడం, గాయంతో సతమతమవుతుండటంతో ఈ ఏడాది ఆఖర్లో జరిగే మెగా ఆక్షన్ లో ధావన్ ను పంజాబ్ కింగ్స్ రీటెయిన్ చేసుకోవడం కష్టంగానే ఉంది. ఒకవేళ ఆక్షన్ లోకి వచ్చి అమ్ముడవకపోతే అవమానం తప్పదు. ఈ విషయంలో ధావన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. తన ఫ్యూచర్ ప్లానింగ్స్ త్వరలో ప్రకటిస్తానని అన్నాడు. ఇక, 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ధావన్ 167 వన్డేలు ఆడి 6,793 పరుగులు, 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2013ని భారత్ సొంతం చేసుకోవడంలో ధావన్ ది కీలకపాత్ర. ఆ టోర్నీలో 5 మ్యాచుల్లో ఏకంగా 363 పరుగులు చేశాడతను. మరి.. ధావన్ రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments