IPL 2024: వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌! కారణం..?

Sunrisers Hyderabad, IPL 2024; బ్యాటింగ్‌ పవర్‌తో ఐపీఎల్‌ 2024 సీజన్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక్కసారిగా డీలా పడింది. మరి రెండు వరుస ఓటములకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Sunrisers Hyderabad, IPL 2024; బ్యాటింగ్‌ పవర్‌తో ఐపీఎల్‌ 2024 సీజన్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక్కసారిగా డీలా పడింది. మరి రెండు వరుస ఓటములకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎలాంటి విధ్వంసకర ఆటను ప్రదర్శించిందో అందరికి తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ చూసి.. మిగతా టీమ్స్‌ అన్ని భయపడ్డాయి. ఇదే బాదుడ్రా బాబు అంటూ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఐపీఎల్‌ చరిత్రలో 11 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆర్సీబీ అత్యధిక ​స్కోర్‌ 263 పరుగుల రికార్డును ఈ ఒక్క సీజన్‌లోనే ఆర్సీబీ ఏకంగా మూడు సార్లు బ్రేక్‌ చేసింది. 266, 277, 287 పరుగులు చేసి.. అదరగొట్టింది. ఈ బ్యాటింగ్‌ స్టామినా చూసి.. ఈ సారి కప్పు ఆరెంజ్‌ ఆర్మీదే అని అంతా భావించారు. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మంచి పొజిషన్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. గత రెండు మ్యాచ్‌ల్లో చెత్త ప్రదర్శనతో డీలా పడిపోయింది.

ఒక్కసారిగా పులి లాంటి ఎస్‌ఆర్‌హెచ్‌ పిల్లాలా మారిపోయింది. దీనికి కారణం ఏంటని చాలా మంది క్రికెట్‌ అభిమానులు, ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ అయితే ఈ విషయంపై బాగా ఫీల్‌ అవుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఇన్ని రోజులు బ్యాటింగ్‌తో విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసలు బలం మాత్రం బౌలింగే. ఇప్పుడనే కాదు.. ఐపీఎల్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌పైనే ఎక్కువ కాన్సట్రేషన్‌ చేసేది. చాలా చిన్న చిన్న టోటల్స్‌ కూడా తమ బౌలింగ్‌ బలంలో డిఫెండ్‌ చేసుకుని, మ్యాచ్‌లు గెలిచేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ చాలా వీక్‌గా ఉంది.

అయితే.. ఈ సీజన్‌లో లక్కీగా బ్యాటింగ్‌ కనెక్ట్‌ అవ్వడంతో విజయాలు వచ్చాయి. ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ ఓడిపోయిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు ఛేజింగ్‌ చేస్తూనే ఓడిపోయింది. బ్యాటింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఎడెన్‌ మార్కరమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి రాణిస్తుండటంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు విజయాలు దక్కాయి. కానీ, బ్యాటింగ్‌ విఫలమైన సమయంలో బౌలర్లు మ్యాచ్‌లు గెలిపించలేకపోతున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు 214 పరుగులు సమర్పించుకున్నారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై ఇన్ని రన్స్‌ ఇవ్వడం ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కారణమైంది. భువనేశ్వర్‌ కుమార్‌, ప్యాట్‌ కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌, టీ నటరాజన్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ ఇలా అంతా వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లే ఉన్నా.. స్థాయికి తగ్గట్లు రాణించకపోవడంతోనే ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటములు ఎదరువుతున్నాయని క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments