Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌కు తీవ్ర అన్యాయం! ఎంపిక చేయపోవడానికి వెనుక కారణం ఇదేనా?

Ruturaj Gaikwad, IND vs SL, Shubman Gill, BCCI: స్టార్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు. బీసీసీఐ అతనికి అన్యాయం చేసిందని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. అతన్ని ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ruturaj Gaikwad, IND vs SL, Shubman Gill, BCCI: స్టార్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు. బీసీసీఐ అతనికి అన్యాయం చేసిందని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అయితే.. అతన్ని ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక టూర్‌ కోసం జట్లను ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం గురువారం భారత సెలెక్టర్లు రెండు వేర్వేరు టీమ్స్‌ను ప్రకటించారు. టీ20 జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ.. యంగ్‌ టీమ్‌ను ఎంపిక చేశారు. అలాగే వన్డేలకు రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ని ప్రకటించారు. కోహ్లీ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడనున్నాడు. టీ20లతో పాటు వన్డేలకు కూడా శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే.. ఈ ఎంపికలో బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు.

అద్భుతమైన టాలెంట్‌తో పాటు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకంటూ.. టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రుతురాజ్‌ గైక్వాడ్‌కు బీసీసీఐ మళ్లీ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్‌లో అద్భుతంగా రాణించినా కూడా గైక్వాడ్‌కు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అలాగని వన్డే సిరీస్‌కు అయినా ఎంపిక చేస్తారంటే అదీ జరగలేదు. ఇలా టీ20లు, వన్డే టీమ్స్‌ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్‌ను డ్రాప్‌ చేసి.. బీసీసీఐ అతనికి తీవ్ర అన్యాయం చేసిందని క్రికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. పైగా టీ20 టీమ్‌కు ఎంపికైన ఓ ఇద్దరు బ్యాటర్లకంటే కూడా రుతురాజ్‌ గైక్వాడ్‌ స్టాట్స్‌ బెటర్‌గా ఉన్నాయని అయినా కూడా అతన్ని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వన్డే టీమ్‌తో పాటు టీ20 టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా నియామకం అయిన శుబ్‌మన్‌ గిల్‌ కంటే టీ20ల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌ స్టాట్స్‌ ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అయినా కూడా గిల్‌కు ఎందుకంటే ప్రియారిటీ ఇస్తున్నారో తెలియడం లేదు. ఇక జింబాబ్వే టూర్‌లో దారుణంగా విఫలమైన రియాన్‌ పరాగ్‌ను కూడా శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ, అతని కంటే ఎంతో మెరుగైన రికార్డ్‌ ఉన్న గైక్వాడ్‌ను పక్కనపెట్టేశారు. ఒకసారి గైక్వాడ్‌, గిల్‌, రియాన్‌ పరాగ్‌ టీ20 స్టాట్స్‌ను పరిశీలిస్తే.. గైక్వాడ్‌ 23 టీ20లు ఆడి 39.56 యావరేజ్‌ 143.54 స్టైక్‌రేట్‌తో 633 పరుగులు చేశాడు. గిల్‌ 19 టీ20ల్లో 29.71 యావరేజ్‌, 139.5 స్టైక్‌రేట్‌తో 505 పరుగులు చేశాడు. ఇద్దరికీ టీ20ల్లో సెంచరీలు ఉన్నా.. గిల్‌ కంటే రుతురాజ్‌ మెరుగైన యావరేజ్‌, స్టైక్‌రేట్‌ కలిగి ఉన్నాడు. అయినా కూడా గైక్వాడ్‌ను తప్పించి, గిల్‌ను టీమ్‌లోకి తీసుకోవడమే కాకుండా వైస్‌ కెప్టెన్‌ను కూడా చేశారు. ఇక రియాన్‌ పరాగ్‌ 3 టీ20లు ఆడాడు అందులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 24. యావరేజ్‌ 12, స్టైక్‌రేట్‌ 88.89 మాత్రమే. అయినా కూడా అతన్ని శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేశారు.

రియాన్‌ పరాగ్‌ ఆడేది మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌లో, రుతురాజ్‌ ఆడేది టాపార్డర్‌లో కదా అని అనుకోవచ్చు. మరి గిల్‌ సంగతేంటి. అతనికి ఏ బేస్‌పై అవకాశం కల్పిస్తున్నారు. గిల్‌.. వన్డేలు, టెస్టుల్లో మంచి ప్లేయర్‌ అయ ఉండొచ్చు. గిల్‌ దక్కిన అవకాశాలు రుతురాజ్‌కు దక్కి ఉంటే.. స్టార్‌ ప్లేయర్‌ అయిపోయేవాడు. అయితే.. శ్రీలంకకు ఎంపిక చేసిన టీమ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడానికి కారణం అతను టాపార్డర్‌ బ్యాటర్‌ కావడమే కారణం అంటున్నారు కొంతమంది క్రికెట్‌ నిపుణులు. టీ20ల్లో జైస్వాల్‌, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌తో టాపార్డర్‌ ఫుల్‌గా ఉందని, అలాగే వన్డేల్లో రోహిత్‌ శర్మ, గిల్‌, కోహ్లీతో కూడా ఫుల్‌గా ఉండటంతోనే రుతురాజ్‌కు చోటు దక్కలేదని అంటున్నారు. కారణం ఏదైనా రుతురాజ్‌ గైక్వాడ్‌కు శ్రీలంకతో సిరీస్‌ కోసం జట్టులో చోటు దక్కకపోవడం అన్యాయమనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments