iDreamPost
android-app
ios-app

RCB: కోహ్లీ ఎఫెక్ట్.. కప్ కొట్టకపోయినా RCBకి అరుదైన అవార్డు!

  • Published Dec 05, 2023 | 6:59 PM Updated Updated Dec 05, 2023 | 6:59 PM

ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తాజాగా ఒక అవార్డు వరించింది. ఐపీఎల్‌లో ఒక్క టైటిల్‌ లేకపోయినా.. ఆర్సీబీకి ఈ అవార్డు దక్కడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందంతా కోహ్లీ వల్లే అంటున్నారు.

ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తాజాగా ఒక అవార్డు వరించింది. ఐపీఎల్‌లో ఒక్క టైటిల్‌ లేకపోయినా.. ఆర్సీబీకి ఈ అవార్డు దక్కడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందంతా కోహ్లీ వల్లే అంటున్నారు.

  • Published Dec 05, 2023 | 6:59 PMUpdated Dec 05, 2023 | 6:59 PM
RCB: కోహ్లీ ఎఫెక్ట్.. కప్ కొట్టకపోయినా RCBకి అరుదైన అవార్డు!

ఐపీఎల్‌ టీమ్స్‌లో ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న టీమ్‌ ఏదంటే అంతా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అని చెబుతారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవకపోయినా.. ఆర్సీబీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఐపీఎల్‌లో అన్ని జట్ల కంటే.. ఆర్సీబీ ఆడే మ్యాచ్‌లకే వ్యూవర్‌షిప్‌ ఎక్కువ. ఆ క్రేజ్‌ అంతా ఒక్క మనిషి వల్లే.. అతనే విరాట్‌ కోహ్లీ. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్సీబీలో ఉన్న కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీమ్‌ మారలేదు. లాయాల్టీకి మారుపేరుగా.. ఇతర ఫ్రాంచైజ్‌ల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా కోహ్లీ ఎప్పుడూ ఆర్సీబీని వీడలేదు.

ఐపీఎల్‌లో ఆడినంత కాలం ఆర్సీబీలోనే కొనసాగుతానని, ఆర్సీబీకి ఆడే అవకాశం లేని రోజు.. ఐపీఎల్‌కి దూరం అవుతానని కూడా కోహ్లీ ప్రకటించాడు. కోహ్లీకి-ఆర్సీబీ అంత బాండింగ్‌ ఉంది. అందుకే ఆర్సీబీ అంటే క్రికెట్‌ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్‌. అంతే ప్రత్యేకమైన ఫ్రాంచైజ్‌కి తాజాగా ఒక అవార్డు కూడా దక్కింది. సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) స్పోర్ట్స్ ఫ్రాంచైజ్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందించింది. ఈ అవార్డును రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ఓనర్లు అందుకున్నారు. కాగా, ఆర్సీబీకి ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం కోహ్లీనే అని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కోహ్లీకి కారణంగానే ఆర్సీబీకి ఇంత క్రేజ్‌ వచ్చిందని, ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవకపోయినా.. ఇంత కూడా క్రేజ్‌ తగ్గకపోవడానికి కోహ్లీనే కారణం అని.. అందుకే ఆర్సీబీ ఫ్రాంచైజ్‌ ఇంత అభివృద్ధి చెందిందని అంటున్నారు. కాగా.. ఐపీఎల్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీని సైతం వదిలేసిన విషయం తెలిసిందే. కోహ్లీ తర్వాత సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా లేకపోయినా.. ఆర్సీబీలో పెద్ద ప్లేయర్‌ అంటే కోహ్లీనే. ఇప్పటికీ కోహ్లీ కోసమే ఆర్సీబీ మ్యాచ్‌లు చేసే వాళ్లు లక్షల సంఖ్యలో ఉంటారు. కోహ్లీ వల్లే ఆర్సీబీ ఇంత క్రేజ్‌ వచ్చిన మాట వాస్తవమే అయినా.. ఇప్పుడు ఆర్సీబీకి అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.