iDreamPost
android-app
ios-app

IPL 2024: RCBనే గెలుస్తుందంటూ తేల్చిచెప్పిన అంబటి రాయుడు!

  • Published May 21, 2024 | 6:28 PMUpdated May 21, 2024 | 6:28 PM

RCB, Ambati Rayudu, IPL 2024: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అందరి అంచనాలను తలకిందులు చేసి.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టు. అదే జట్టు.. గెలుస్తుందని అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

RCB, Ambati Rayudu, IPL 2024: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అందరి అంచనాలను తలకిందులు చేసి.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టు. అదే జట్టు.. గెలుస్తుందని అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published May 21, 2024 | 6:28 PMUpdated May 21, 2024 | 6:28 PM
IPL 2024: RCBనే గెలుస్తుందంటూ తేల్చిచెప్పిన అంబటి రాయుడు!

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ కొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీ స్టార్టింగ్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆ జట్టు.. లీగ్‌ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఏకంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఏకంగా 7 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని.. నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. అయితే.. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో అని క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా వరకు ఆర్సీబీకే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక విజయం సాధిస్తుందని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు. ఎలిమినేటర్‌లో గెలిచి.. క్వాలిఫైయర్‌-2కు ఆర్సీబీ వెళ్తుందన అన్నాడు. ఆర్సీబీ విజయం సాధిస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే వాళ్లు ఆడుతున్న విధానం చాలా గొప్పగా ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి పటిష్టమైన టీమ్‌పై ఆర్సీబీ ఆడిన తీరు అద్భుతం అని అన్నాడు. ఆర్సీబీ జట్టులో ప్రతి ఆటగాడికి తన పాత్రపై స్పష్టత ఉందని, అందుకే క్వాలిఫయిర్స్‌-2కు ఆర్సీబీ వెళ్తుందని తాను నమ్ముతున్నట్లు రాయుడు వెల్లడించాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ను చూస్తే.. ఆ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఇది ఆ జట్టుకు సానుకూలంగా మారుతుందా ప్రతికూలంగా మారుతుందో తెలియదని, పైగా ఆ జట్టు కాస్త వీక్‌గా కనిపిస్తోందని అన్నాడు.

రాజస్థాన్‌ ఈ సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా ఆడింది. వరుస విజయాలతో టేబుల్‌ టాపర్‌గా చాలా రోజుల పాటు నిలిచింది. కానీ, అదే జట్టు.. ప్లే ఆఫ్స్‌కు దగ్గర అవుతున్న కొద్ది వరుస ఓటములు చవిచూసింది. పైగా స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ స్వదేశం వెళ్లిపోవడం, మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోవడంతో పాటు.. బ్యాటింగ్‌లో ఎ‍క్కువగా కెప్టెన్‌ సంజు శాంసన్‌, రియాన్‌ పరాగ్‌పై ఆ టీమ్‌ ఆధారపడుతోంది. బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, చాహల్‌, ఆవేశ్‌ ఖాన్‌ మాత్రమే రాణిస్తున్నారు. కానీ, ఆర్సీబీ మాత్రం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. మరి ఎలిమినేటర్‌లో గెలిచి.. క్వాలిఫైయర్‌-2కు ఆర్సీబీ అర్హత సాధిస్తుందని రాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి