iDreamPost
android-app
ios-app

CSKతో మ్యాచ్‌కి ముందు RCBకి బిగ్‌ షాక్‌! నో ప్లే ఆఫ్స్‌..!

  • Published May 16, 2024 | 4:10 PM Updated Updated May 16, 2024 | 4:10 PM

RCB vs CSK, IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌కి ముందు ఆర్సీబీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

RCB vs CSK, IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌కి ముందు ఆర్సీబీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 16, 2024 | 4:10 PMUpdated May 16, 2024 | 4:10 PM
CSKతో మ్యాచ్‌కి ముందు RCBకి బిగ్‌ షాక్‌! నో ప్లే ఆఫ్స్‌..!

ఐపీఎల్‌ 2024 తొలి అర్ధ భాగంలో వరుస ఓటములతో సతమతమైన ఆర్సీబీ.. ఆ తర్వాత డిఫరెంట్‌ టీమ్‌గా మారి వరుసగా 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ నెల 18న చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిస్తే.. ఫ్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే మధ్య జరిగే చివరి మ్యాచ్‌ ఒక అన్‌అఫీషియల్‌ నాకౌట్‌ మ్యాచ్‌లా మారిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లారు. సీఎస్‌కే గెలిస్తే చాలు. కానీ, కొన్ని లెక్కలతో గెలవాలి. తొలుత బ్యాటింగ్‌ చేస్తే.. 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో గెలవాలి. ఛేజింగ్‌కు దిగితే.. 18.1 ఓవర్లలో ఎంత టార్గెట్‌ ఉన్న కొట్టి పారేయాలి. అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఉన్న ఫామ్‌ దృష్ట్యా చూస్తే అది అంత పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ, ఆర్సీబీకి ప్రకృతి నుంచి ఓటమి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ జరిగే రోజు వర్షం వచ్చే సూచనలు ఉన్నట్లు బెంగళూరు వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే 18వ తేదీ నాడు 40 నుంచి 45 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఒక వేళ వర్షం వచ్చి.. మ్యాచ్‌ రద్దు అయితే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లకుండా ఈ సీజన్‌లో తమ ప్రస్థానం ముగిస్తుంది. మ్యాచ్‌ రద్దు అయితే సీఎస్‌కే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ జరగడం ఆర్సీబీకి ఎంతో ముఖ్యం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.