SNP
RCB Vs CSK, IPL 2024: ఈ నెల 18న సీఎస్‌కేతో ఆర్సీబీ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఆర్సీబీకి అనుకూలంగా కొన్ని ఫలితాలు వస్తే.. ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్‌లా మారనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ సెంటిమెంట్ ప్రకారం రెండింటిలో ఈ టీమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ టీమ్ ఏదో ఇప్పుడు చూద్దాం..
RCB Vs CSK, IPL 2024: ఈ నెల 18న సీఎస్‌కేతో ఆర్సీబీ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు ఆర్సీబీకి అనుకూలంగా కొన్ని ఫలితాలు వస్తే.. ఆర్సీబీ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్‌లా మారనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ సెంటిమెంట్ ప్రకారం రెండింటిలో ఈ టీమే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. ఆ టీమ్ ఏదో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్రతి జట్టుకు దాదాపు ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఓ నాలుగు టీమ్స్‌కు మాత్రమే రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయినా కూడా కేవలం ఒక్క టీమ్ మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. ఓ మూడు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. 19 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న కేకేఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఎస్‌ఆర్‌హెచ్‌కు మంచి ఛాన్స్ ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న సీఎస్‌కే, ఆర్సీబీ ఈ నెల 18న తమ చివరి లీగ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఈ మ్యాచ్ రెండు టీమ్స్‌కు ఎంతో కీలకం. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కచ్చితంగా గెలిచి తీరాలి. అందుకే రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాయి.
అయితే.. ఈ మ్యాచ్‌కు సంబంధించి.. ఆర్సీబీని ఓ క్రేజీ సెంటిమెంట్ ఊరిస్తోంది. అదేంటంటే.. మే 18వ తేదీన ఆర్సీబీ ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పైగా ఆయా మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మే 18న ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఆయా మ్యాచ్‌ల్లోనే ఆర్సీబీనే గెలిచింది. విరాట్ కోహ్లీ మే 18న ఆడిన మ్యాచ్‌ల్లో 2013లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 56(నాటౌట్), 2014లో మళ్లీ సీఎస్‌కేపైనే 29 బంతుల్లో 27, 2016లో పంజాబ్‌తో 50 బంతుల్లో 113, 2023లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 63 బంతుల్లో 100 పరుగులు చేసి.. అదరగొట్టాడు. ఇప్పుడు మళ్లీ మే 18న సీఎస్‌కే మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సార్లు సీఎస్‌కేతోనే ఆడింది. ఆర్సీబీ.. ఆ రెండు మ్యాచ్‌ల్లో కూడా గెలుపొందింది. ఇప్పుడు కూడా ఆర్సీబీనే గెలుస్తుందని క్రికెటర్ అభిమానులు అంటున్నారు. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli on 18th May in IPL history:
56* (29) Vs CSK in 2013 (RCB won).
27 (29) Vs CSK in 2014 (RCB won).
113 (50) Vs KXIP in 2016 (RCB won).
100 (63) Vs SRH in 2023 (RCB won).RCB NEVER LOST A MATCH ON 18TH MAY…!!! 🤯🔥 pic.twitter.com/pPZBO50ZyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024