Nidhan
నెక్స్ట్ లెవల్ హిట్టింగ్తో రెచ్చిపోయిందో ఆర్సీబీ క్రికెటర్. ఆమె కొట్టిన ఓ షాట్‌కు ఏకంగా కారు అద్దాలు పగిలాయి. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
నెక్స్ట్ లెవల్ హిట్టింగ్తో రెచ్చిపోయిందో ఆర్సీబీ క్రికెటర్. ఆమె కొట్టిన ఓ షాట్‌కు ఏకంగా కారు అద్దాలు పగిలాయి. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
విమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ బౌలింగ్‌తో మహిళా క్రికెటర్లు ఆడియెన్స్‌కు మస్తు వినోదాన్ని పంచుతున్నారు. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుస విజయాలతో ఆ టీమ్ దుమ్మురేపుతోంది. ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ స్మృతి సేన దూసుకుపోతోంది. వారియర్జ్ టీమ్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది ఆర్సీబీ. అయితే ఈ మ్యాచ్‌లో ఓ బెంగళూరు బ్యాటర్ కొట్టిన బాల్ దెబ్బకు ఏకంగా కారు అద్దం ధ్వంసమైంది. ఆ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వారియర్జ్‌తో మ్యాచ్‌లో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (80) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అలీసా పెర్రీ (55), దీప్తి శర్మ (33), పూనమ్ ఖేమ్నర్ (31) కూడా రాణించారు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పెర్రీ బ్యాటింగ్, అందులోనూ ఆమె బాదిన భారీ సిక్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. మిడ్ వికెట్లో పడిన బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్‌గా తరలించింది. ఆమె షాట్ కొట్టగానే అంతా అది సిక్స్ అనే అనుకున్నారు. అయితే ఆ బాల్ ఏకంగా స్టాండ్స్‌లో పార్క్ చేసి ఉన్న కారు అద్దానికి బలంగా తాకింది. బాల్ తగిలిన స్పీడ్‌కు ఆ అద్దం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో ఆర్సీబీ డగౌట్లో కూర్చున్న ప్లేయర్లు అంతా ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.
సిక్స్ దెబ్బకు కారు అద్దం పగలడంతో షాట్ కొట్టిన ఎలిస్ పెర్రీ డిఫరెంట్‌గా రియాక్ట్ అయింది. అయ్యో.. ఎంత పనైంది అంటూ తల మీద చేయి వేసి బాధపడుతూ కనిపించింది. పెర్రీ సిక్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇదేం బాదుడు భయ్యా అని షాకవుతున్నారు. పెర్రీ మాస్ హిట్టింగ్ వేరే లెవల్ అని చెబుతున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుపై కన్నేసిందని.. అందుకే ఆమె ఆ కారు అద్దాన్ని బ్రేక్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విసిరిన 198 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 175 పరుగులకే పరిమితమైంది. మరి.. పెర్రీ బ్యాటింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐపీఎల్-2024కు ముందు ధోని ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కెప్టెన్సీకి గుడ్‌బై?
𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗲𝗰𝗼𝗿𝗱 𝗶𝘀 𝘁𝗼𝗼 𝗺𝗮𝗶𝗻𝘀𝘁𝗿𝗲𝗮𝗺
So Ellyse Perry broke the glass 😉❤️#CricketTwitter #WPL2024 #UPWvRCB pic.twitter.com/ct5NgQiOl6
— Female Cricket (@imfemalecricket) March 4, 2024