iDreamPost
android-app
ios-app

RCB విజయంపై సిద్ధార్థ్ వివాదాస్పదమైన ట్వీట్ అంటూ వార్తలు.. క్లారిటీ మిస్..

Siddharth Tweet On RCB Celebrations: ఆర్సీబీ జట్టు, ఫ్యాన్స్ కప్పు కొట్టిన ఆనందంలో ఉన్నారు. నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

Siddharth Tweet On RCB Celebrations: ఆర్సీబీ జట్టు, ఫ్యాన్స్ కప్పు కొట్టిన ఆనందంలో ఉన్నారు. నిన్నటి నుంచి సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

RCB విజయంపై సిద్ధార్థ్ వివాదాస్పదమైన ట్వీట్ అంటూ వార్తలు.. క్లారిటీ మిస్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కొన్ని గంటలుగా నెట్టింట ఈ పేరు మారు మోగుతోంది. అందుకు కారణం అందరికీ తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆర్సీబీ జట్టు విజేచగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో ఢిల్లీ జట్టుపై ఘన విజయం సాధించింది. కప్పు కొట్టిన ఆనందం జట్టులోనే కాదు.. ఆర్సీబీ ఫ్యాన్స్ లో కూడా వెల్లివిరుస్తోంది. 16 ఏళ్లుగా మెన్స్ టీమ్ కప్పు కొట్టలేకపోయింది. కానీ, ఉమెన్స్ జట్టు మాత్రం లీగ్ స్టార్ట్ అయిన రెండో ఎడిషన్ లోనే కప్పు కొట్టడంతో వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. కోహ్లీ కూడా వీడియో కాల్ చేసి టీమ్ కి శుభాకాంక్షలు చెప్పాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్సీబియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, సిద్ధార్థ్ మాత్రం ఈ సెలబ్రేషన్స్ పై వివాదాస్పద ట్వీట్ చేశాడు అంటున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు ట్రోఫీ కొట్టింది. నిన్న రాత్రి ప్రారంభమైన సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కప్పు కొట్టిన ఆనందం ఎలా ఉంటుందో ఆర్సీబీ ఫ్యాన్స్ తొలిసారి అనుభవిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆర్సీబీ కప్పు కొట్టిందని తెలియగానే ఫ్యాన్స్ అంతా వీధుల్లోకి వచ్చేశారు. తమ అభిమాన జట్టు కప్పు కొట్టిందని సంతోషాన్ని ఫ్రెండ్స్ తో కలిసి బెంగళూరు వీధుల్లో పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ పై హీరో సిద్ధార్థ్ పేరిట ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అది కాస్తా వివాదాస్పదంగా మారింది. అసలు సిద్ధార్థ్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

సిద్ధార్థ్ పేరిట ఉన్న పోస్టులో ఏం అన్నాడంటే.. “ఒక మహిళల జట్టు ట్రోఫీ గెలిచింది. కానీ, సెలబ్రేట్ చేసకోవడానికి ఒక్క మహిళ కూడా బయటకు రాలేదు. ఇందుకు పితృస్వామ్య వ్యవస్థే కారణం” అంటూ ఆ పోస్టులో ఉంది. బెంగళూరు వీధుల్లో సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక వీడియోని రీ పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. దీనిపై కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. అసలు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి ఇంకో పోస్ట్ తో క్లారిటీ కూడా ఇచ్చాడు.

“నా ఉద్దేశం ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితి కోట్ చేయడమే. అమ్మాయిల జట్టు ఒక ఐకానిక్ విజయాన్ని నమోదు చేసింది. కానీ, దానిని సెలబ్రేట్ చేసుకోవడానికి అబ్బాయిల్లా.. అమ్మాయిలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అమ్మాయిలకు బయటకు వచ్చేందుకు వీలులేదు. ఈ విషయాన్నే పాయింట్ అవుట్ చేస్తున్నాను” అంటూ ఇంకో ట్వీట్ ద్వారా క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ ఎక్స్.కామ్ హ్యాండిల్ హీరో సిద్ధార్థ్ అనడానికి క్లారిటీ మిస్ అవుతోంది. ట్విట్టర్ ఖాతా చూస్తే ఒక్క పోస్ట్ కూడా సినిమాలకు సంబంధించినట్లు లేవు. ఇది హీరో పేజ్ అనుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో అన్నీ సినిమా పోస్టులే ఉన్నాయి. కానీ, ట్విట్టర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడే క్లారిటీ మిస్ అవుతోంది. మరి.. సిద్ధార్థ్ పేరిట ఉన్న ఈ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.