iDreamPost
android-app
ios-app

RCB vs DC: IPL 2024లో రికార్డ్ సృష్టించిన RCB! ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే!

ఢిల్లీపై సాధించిన విజయం ద్వారా ఐపీఎల్ 2024లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. దాంతో ఈ సీజన్ లో ఈ రికార్డ్ సాధించిన తొలి టీమ్ గా ఆర్సీబీ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీపై సాధించిన విజయం ద్వారా ఐపీఎల్ 2024లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. దాంతో ఈ సీజన్ లో ఈ రికార్డ్ సాధించిన తొలి టీమ్ గా ఆర్సీబీ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

RCB vs DC: IPL 2024లో రికార్డ్ సృష్టించిన RCB! ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే!

ఐపీఎల్  2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఎప్పుడో ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా చెలరేగిపోతోంది. తప్పకుండా అన్నీ గెలవాల్సిన మ్యాచ్ ల్లో సత్తాచాటుతూ.. తాము ఇంకా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉన్నామంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 47 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజలో ఓ అరుదైన ఘనతను సాధించింది. తద్వారా ఈ సీజన్  లో ఈ రికార్డ్ సాధించిన తొలి టీమ్ గా ఆర్సీబీ నిలిచింది.

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ ఎవ్వరూ ఊహించని విధంగా చెలరేగిపోతోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 47 పరుగులతో ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ రజత్ పాటిదార్, గ్రీన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కోహ్లీ(27), డుప్లెసిస్(6) విఫలం కాగా.. రజత్ పాటిదార్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 52 రన్స్ చేయగా.. కామెరూన్ గ్రీన్ 32 రన్స్ తో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిక్ సలామ్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని తొలి ఓవర్ లోనే దెబ్బకొట్టాడు స్వప్నిల్ సింగ్. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(1)ను తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పోరెల్(2), షై హోప్(29), కుమార్ కుషాగ్ర(2),  చిచ్చర పిడుగు ఓపెనర్ జేక్ ఫ్రేజర్(21) రన్స్ కే అవుట్ అయ్యారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. మిగతా ప్లేయర్లు రాణించకపోవడం, ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. 19.1 ఓవర్లలో 140 రన్స్ కే ఢిల్లీ ఆలౌట్ అయ్యింది.

ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ 3.1 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఈ విజయంతో ఐపీఎల్ 2024 సీజన్ లో వరుసగా 5 విజయాలు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది ఆర్సీబీ. తొలి 8 మ్యాచ్ ల్లో ఒక్కటే విజయం సాధించి.. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ లో జయకేతం ఎగరవేసింది. సన్ రైజర్స్, గుజరాత్ ను రెండుసార్లు, పంజాబ్ ను ఒకసారి, తాజాగా ఢిల్లీని ఓడించింది. మరి ఈ సీజన్ వరుసగా ఐదు విజయాలతో చరిత్ర సృష్టించిన ఆర్సీబీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి