iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: వీడియో: చాలా రోజుల తర్వాత జడేజా మార్క్‌ సెలబ్రేషన్స్‌!

  • Published Jan 26, 2024 | 5:00 PM Updated Updated Jan 26, 2024 | 5:00 PM

హైదరాబాద్‌ టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో దుమ్మరేపుతోంది. ఈ క్రమంలోనే జడేజా తన ట్రేడ్‌ మార్క్‌ సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

హైదరాబాద్‌ టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో దుమ్మరేపుతోంది. ఈ క్రమంలోనే జడేజా తన ట్రేడ్‌ మార్క్‌ సెలబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు.

  • Published Jan 26, 2024 | 5:00 PMUpdated Jan 26, 2024 | 5:00 PM
Ravindra Jadeja: వీడియో: చాలా రోజుల తర్వాత జడేజా మార్క్‌ సెలబ్రేషన్స్‌!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. హైదరాబాద్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు తొలి రోజే కేవలం 246 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లు ఇంగ్లండ​్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజా సైతం హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు. జైస్వాల్‌ 80, కేఎల్‌ రాహుల్‌ 86 పరుగులతో సెంచరీకి చేరువగా వచ్చి అవుట్‌ అయ్యారు. కానీ, జడేజా ఇంకా తన పోరాటం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత జడేజా తన ట్రేడ్‌ మార్క​్‌ సెలబ్రేషన్స్‌తో అభిమానులను అలరించాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత జడేజా తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పుతూ తన మార్క్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ఈ సమయంలో ఉప్పల్‌ స్టేడియం చప్పట్లతో మారుమోగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే.. జడేజా రాజసంగా బ్యాట్‌ను అలా తిప్పుతుంటే.. స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ప్రస్తుతం భారత ఇన్నింగ్స్‌ 99 ఓవర్లు ముగిసే సరికి.. జడేజా 125 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేసి.. క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి మిగిలిన ఆటగాళ్లు సపోర్ట్‌ చేస్తే సెంచరీ కూడా పూర్తి చేసుకునేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఈ స్కోర్‌ మరింత పెరగొచ్చు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 64.3 ఓవర్లలోనే కేవలం 246 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఒక్కడే.. 88 బంతుల్లో 70 పరుగులు చేసి రాణంచాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అయ్యారు. భారత స్పిన్‌ మ్యాజిక్‌ ముందు అంతా తేలిపోయారు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా.. 23 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసి తొలి రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 368 పరుగులతో ఉంది. క్రీజ్‌లో జడేజా, అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌తో పాటు అతని ట్రేడ్‌ మార్క్‌ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.