iDreamPost
android-app
ios-app

టీమిండియాలో అతనొక్కడికే నేను ఎక్కువ భయపడతా: రవీంద్ర జడేజా

  • Published Jun 15, 2024 | 7:00 PM Updated Updated Jun 15, 2024 | 7:00 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలో అతనొక్కడికే నేను ఎక్కువ భయపడతాను అంటూ చెప్పుకొచ్చాడు జడ్డూ భాయ్. మరి అతడు భయపడేది ఎవరికి?

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాలో అతనొక్కడికే నేను ఎక్కువ భయపడతాను అంటూ చెప్పుకొచ్చాడు జడ్డూ భాయ్. మరి అతడు భయపడేది ఎవరికి?

టీమిండియాలో అతనొక్కడికే నేను ఎక్కువ భయపడతా: రవీంద్ర జడేజా

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా అదరగొడుతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి.. సూపర్ 8కు దూసుకెళ్లింది. ఇక నామమాత్రపు మ్యాచ్ కోసం ప్లోరిడా వేదికగా కెనడాతో నేడు(జూన్ 15)న తలపడబోతోంది. ఇక ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువ అభిమానులతో చిట్ చాట్ చేశారు  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్స్ రవీంద్ర జడేజా, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ ఇద్దరు ఆల్ రౌండర్లు.

టీమిండియా  స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు స్టార్ స్పోర్ట్స్ తో సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే టీమిండియాలో తాను ఎక్కువ ఏ క్రికెటర్ కు భయపడతానో వెల్లడించాడు జడేజా. ఈ ప్రోగ్రామ్ లో ఓ చిన్న పిల్లాడు.. “నువ్వు చాలా ధైర్యవంతుడివా? ఎవ్వరికీ భయపడలేదా? అని జడేజాను ప్రశ్నించాడు. దానికి జడ్డూ ఆన్సర్ ఇస్తూ..”నేను టీమిండియాలో ధోని భాయ్ కు చాలా భయపడతాను. మిగతా వారికి అంత భయపడను” అంటూ నవ్వుతూ చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి.

ఇక ధోనికి జడేజాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దశాబ్ద కాలంగా కలిసి ఆడుతున్నారు. అలాగే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అలాగే పరుగుల ఖాతా కూడా తెరవలేదు. పైగా వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ గా పేరొందిన జడ్డూ ఒక్క క్యాచ్ కూడా అందుకోకపోవడం గమనార్హం. మరి రాబోయే మ్యాచ్ ల్లో అయినా రాణిస్తాడో? లేదో? చూడాలి. మరి ధోనికి తాను భయపడతాను అని చెప్పిన జడ్డూ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.