SNP
SNP
టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్, 1983లో టీమిండియాకు మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. అలాంటి వ్యక్తి టీమిండియా క్రికెటర్ల గురించి ఓ సంచలన కామెంట్ చేశారు. దానికి టీమిండియా స్టార్ ఆలౌండర్ రవీంద్ర జడేజా కౌంటర్ ఇచ్చాడు. కపిల్ దేవ్ చెప్పినట్లు టీమ్‌లో అలా ఎవరూ లేరని, అయినా నేను సోషల్ మీడియాలో ఇలాంటి విషయాల గురించి వెతకనని అన్నాడు. అలాగే ఒక మాజీ క్రికెటర్‌గా కపిల్ దేవ్‌కు ఆయన అభిప్రాయం చెప్పే హక్కు ఉందని అన్నాడు.
కాగా, టీమిండియాను ఉద్దేశించి కపిల్ దేవ్ ఏం వ్యాఖ్యలు చేశారంటే.. భారీగా డబ్బు వస్తుండటంతో టీమిండియా క్రికెటర్లకు అహంకారం బాగా పెరిగిపోయిందని, మజీల నుంచి సలహాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని, తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారంటూ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లోని ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాపై కపిల్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జట్టు గడ్డు పరిస్థితుల్లో ఉన్నా.. అక్కడే సునీల్ గవాస్కర్ లాంటి లెంజెడ్ ఉన్నా కూడా కనీసం ఆయనను ఎవరూ సంప్రదించలేదు.
గవాస్కర్ సలహాలు తీసుకుని ఉంటే టీమిండియా మరింత మెరుగైన స్థితితో ఉండేంది. అయినా వారికి మాజీల సలహాలు తీసుకోవాలనే ఆసక్తి అసలే లేదు అని విమర్శించారు. ఈ విషయంపై సునీల్ గవాస్కర్ సైతం స్పందిస్తూ.. వాళ్లకు మాజీలంటే పెద్దగా ఆసక్తి లేదు. ఇంకా సలహాలు ఏం తీసుకుంటారని అన్నారు. అయితే.. వీటి గురించి ఓ ప్రముఖ మీడియా ప్రతినిధి జడేజాను ప్రశ్నించగా జడేజా పై విధంగా స్పందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండు సార్లు ఆడిన టీమిండియా 2021లో న్యూజిలాండ్‌పై, 2023లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరి టీమిండియాపై కపిల్ చేసి కామెంట్ అలాగే జడేజా ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐర్లాండ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI.. కెప్టెన్‌గా బుమ్రా