iDreamPost
android-app
ios-app

Ravindra Jadeja: జడేజా ఫ్యూచర్​పై క్లారిటీ ఇచ్చిన అగార్కర్.. మొత్తానికి తేల్చేశారు!

  • Published Jul 22, 2024 | 4:19 PM Updated Updated Jul 22, 2024 | 4:19 PM

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టీ20 వరల్డ్ కప్​తో పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పాడు. దీంతో అతడి భవిష్యత్ ఎలా ఉంటుంది? మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడికి ఏ మేర అవకాశాలు ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టీ20 వరల్డ్ కప్​తో పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పాడు. దీంతో అతడి భవిష్యత్ ఎలా ఉంటుంది? మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడికి ఏ మేర అవకాశాలు ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.

  • Published Jul 22, 2024 | 4:19 PMUpdated Jul 22, 2024 | 4:19 PM
Ravindra Jadeja: జడేజా ఫ్యూచర్​పై క్లారిటీ ఇచ్చిన అగార్కర్.. మొత్తానికి తేల్చేశారు!

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2024తో పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశాడు జడ్డూ. ఇక మీదట వన్డేలు, టీ20లకు మాత్రమే పరిమితం అవుతానని తెలిపాడు. ప్రపంచ కప్ డ్రీమ్ నెరవేరడం అద్భుతంగా ఉందన్నాడు. మెగాటోర్నీ ముగిశాక స్వదేశానికి వచ్చిన జడ్డూ.. విక్టరీ సెలబ్రేషన్స్​లో సందడి చేశాడు. అనంతరం ఇంటికి పయనమయ్యాడు. త్వరలో జరిగే శ్రీలంక సిరీస్​లో ఈ ఆల్​రౌండర్ ఆట చూద్దామని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అతడ్ని ఆ సిరీస్​కు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. లంకకు వెళ్లే వన్డే టీమ్​లో జడ్డూకు చోటు దొరకలేదు. దీంతో అతడి పనైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టెస్టుల్లో సూపర్బ్​గా ఆడుతూ టీమ్ విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జడేజా.. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్​లో పూర్తిగా తేలిపోతున్నాడు. ఇటీవల జరిగిన పొట్టి ప్రపంచ కప్​లోనూ అతడు పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ముఖ్యంగా బౌలింగ్​లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి కథ ముగిసిందని.. ఇక టెస్టులకే పరిమితం అవుతాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. జడ్డూ భవిష్యత్తుపై అతడు తేల్చేశాడు. జడేజాను వన్డే సిరీస్​లోకి సెలెక్ట్ చేయకపోవడానికి ఓ రీజన్ ఉందన్నాడు. ఆల్రెడీ అక్షర్ పటేల్ రూపంలో ఆల్​రౌండర్ స్థానానికి ఆప్షన్ ఉండటంతో జడేజాను పక్కనబెట్టామన్నాడు.

జడేజాను సిరీస్​కు ఎంపిక చేయలేనంత మాత్రం అతడ్ని పూర్తిగా పక్కనబెట్టినట్లు కాదన్నాడు అగార్కర్. అక్షర్ టీమ్​లోకి వచ్చాడు కాబట్టి జడేజాను బెంచ్ మీద పెట్టామని.. అంతేగానీ అతడ్ని జట్టు నుంచి తీసేయలేదన్నాడు. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ జడ్డూ ఎంతో ముఖ్యమైన ఆటగాడని.. అతడి సేవలు టీమిండియాకు అవసరమన్నాడు అగార్కర్. మున్ముందు సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉందని.. ఆ ఫార్మాట్​లో జడ్డూ ఎంతో విలువైన ఆటగాడని స్పష్టం చేశాడు. ఇక, సీమ్ ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ దక్కకపోవడం గురించి కూడా అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. ఫిట్​నెస్​ ఇష్యూస్ కారణంగానే పాండ్యాకు ఆ పోస్ట్ దక్కలేదన్నాడు. అన్ని టీ20 మ్యాచులకు అందుబాటులో ఉండే సారథి కావాలనే ఉద్దేశంతోనే సూర్యకుమార్​ను కెప్టెన్​ చేశామన్నాడు. మరి.. జడ్డూ కెరీర్ మున్ముందు ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.