నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. లెజెండరీ క్రికెటర్స్ అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ను జడ్డూ అధిగమించాడు.
నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. లెజెండరీ క్రికెటర్స్ అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ను జడ్డూ అధిగమించాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత జట్టు జోరుకు ఎదురే లేకుండా పోతోంది. లీగ్ స్టేజ్‌లో ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచుల్లోనూ నెగ్గిన టీమిండియా.. ఆఖరి పోరులో నెదర్లాండ్స్నూ చిత్తు చేసింది. లీగ్ స్టేజ్‌లో భాగంగా తన చివరి మ్యాచ్‌లో డచ్ టీమ్‌తో తలపడింది రోహిత్ సేన. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 160 రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ అన్ని ఓవర్లాడి 4 వికెట్లకు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో అదరగొట్టారు. వీళ్లతో పాటు రోహిత్ శర్మ (61), శుబ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) కూడా రాణించారు.
డచ్ బౌలర్లలో బాస్ డీ లీడ్ 2 వికెట్లు తీశాడు. వాండర్ మెర్వ్, పాల్ వాన్ మీక్రెన్కు చెరో వికెట్ దక్కింది. కొండంత లక్ష్యాన్ని ఛేజ్ చేసేందుకు దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ టీమ్ ఓపెనర్ వెస్లీ బారెసీ 4 రన్స్ చేసి సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత మాక్స్ ఓడౌడ్ (30), కొలిన్ అకెర్మన్ (35) కలసి టీమ్‌ను ఆదుకున్నారు. అయితే ఆ తర్వాత వీళ్లిద్దరూ తక్కువ టైమ్‌లోనే ఔటయ్యారు. సైబ్రండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (45), తేజ నిడమనూరు (54) రాణించినప్పటికీ ఛేదించాల్సిన స్కోరు భారీగా ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఒక్కో వికెట్ దక్కడం గమనార్హం.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున 9 మంది బౌలర్లు బౌలింగ్‌కు దిగడం విశేషం. ఒక వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇలా తొమ్మిది మంది ప్లేయర్లతో బౌలింగ్ వేయించడం 31 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పాలి. 1992 వరల్డ్ కప్‌లో కివీస్ టీమ్ 9 మంది బౌలర్లను వినియోగించింది. అంతకుముందు 1987 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ కూడా తొమ్మిది మంది క్రికెటర్లతో బౌలింగ్ వేయించింది. సెమీస్‌లో మెయిన్ బౌలర్లలో ఎవరైనా విఫలమైనా, ఒకవేళ వికెట్లు పడకపోతే బ్రేక్ త్రూ కావాలన్నా పార్ట్ టైమర్ అవసరమని టీమిండియా మేనేజ్మెంట్ గ్రహించింది. అందుకే డచ్ టీమ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 9 మంది ప్లేయర్లను బౌలింగ్‌కు దింపింది. భారత్ బౌలింగ్ ప్రయోగం కొంతమేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్ వేసి ఒక్కో వికెట్ తీశారు.
ఇక, ఈ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పటిలాగే అద్భుతంగా బౌలింగ్ వేశాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ డచ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన జడ్డూ.. వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. 1996 వరల్డ్ కప్‌లో 15 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే, 2011 ప్రపంచ కప్‌లో 15 వికెట్లు తీసుకున్న యువరాజ్ సింగ్‌ను జడేజా (16 వికెట్లు) అధిగమించాడు. కుంబ్లే, యువీ రికార్డును బ్రేక్ చేసిన జడ్డూ సెమీస్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. దీంతో టోర్నీ అయిపోయేసరికి అతడు 20 వికెట్ల మైలురాయికి చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మరి.. కుంబ్లే, యువీ రికార్డును జడ్డూ బ్రేక్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. వైరల్‌గా మారిన అనుష్క శర్మ రియాక్షన్!
Silently and consistently, Sir Jadeja is performing his duties and setting records! 🙇🏻#RavindraJadeja #Cricket #India #CWC23 #Sportskeeda pic.twitter.com/a31VYF35PA
— Sportskeeda (@Sportskeeda) November 13, 2023