కోహ్లీ, రోహిత్ బాటలో మరోస్టార్ క్రికెటర్! పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు..

టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఆటగాళ్ల రిటైర్మెంట్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. కప్ ను గెలుచుకున్న వెంటనే రోహిత్, కోహ్లీలు టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ వీరి బాటలో నడించాడు.

టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఆటగాళ్ల రిటైర్మెంట్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. కప్ ను గెలుచుకున్న వెంటనే రోహిత్, కోహ్లీలు టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ క్రికెటర్ వీరి బాటలో నడించాడు.

తమ చిరకాల స్వప్నం నెరవేరిన వేళ ఆటగాళ్లు రిటైర్మెంట్స్ ప్రకటిస్తూ ఉంటారు. ఇప్పటికే వివిధ దేశాల స్టార్ క్రికెటర్లు పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి బాటలో మరో కీ ప్లేయర్ కూడా పొట్టి ఫార్మాట్ కు దూరం కానున్నట్లు ప్రకటించాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సమయంలోనే తాను కూడా టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. అయితే వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. వరల్డ్ కప్ గెలవడంతో తన కల నిజమైందని, పొట్టి ఫార్మాట్ లో ప్రపంచ కప్ గెలవడం అత్యుత్తమని అన్నాడు. కెరీర్ లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు జడేజా.

ఇప్పటి వరకు 74 అంతర్జాతీయ టీ20లకు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన జడేజా.. 515 పరుగులు చేసి, 54 వికెట్లు పడగొట్టాడు. అయితే.. 35 ఏళ్ల జడ్డూ టీ20లకు వీడ్కోలు పలకడం అందరిని షాక్ కు గురించేసింది. ఎందుకంటే? టీ20 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ అనుకుంటూ వస్తున్నారు. కానీ జడేజా కూడా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాడని ఎవ్వరూ ఊహించలేదు. మరి రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments